పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచవచ్చునని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు ధ్రువీకరించాయి. భారతదేశంలో సుమారు 42% ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి, ప్రధాన మంత్రి, శ్రీ. నరేందర్ మోడీ 2014 ఆగస్టు 28 న ప్రధాన మంత్రి జన్న్ ధన్ యోజన ప్రారంభించారు. ప్రతి ఇంటిలోనూ కనీసం ఒక ప్రాథమిక బ్యాంకింగ్ ఖాతాతో బ్యాంకింగ్ సేవలను బాటమ్ ఆఫ్ పిరమిడ్ వినియోగదారులు అందుబాటులోకి తీసుకుని రావడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
అయితే ప్రధానమంత్రి జన్-ధన్ యోజన(పీఎంజేఈవై) కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో ఏడాదిగా లావాదేవీలు జరపని పక్షంలో అవి స్థంభించిపోనున్నాయి. బ్యాంకింగ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌లో ఇప్పటికే కొన్ని లక్షల ఖాతాలు స్థంభించిపోయాయి. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు జన్-ధన్ ఖాతాలను తెరిచారు. ఇలా ఖాతాలు తెరిచిన వారికి రెండు లక్షల రూపాయల వరకూ ప్రమాద బీమా కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు వీరందరికీ రూపే కార్డులను కూడా అందించారు. అయితే ఇలా ఖాతాలు తెరిచినవారు బ్యాంకులలో లావాదేవీలు జరపడం లేదు. దీంతో వీరి ఖాతాలు స్థంభించిపోతున్నాయి. బీహార్‌లో ఇప్పటిరకూ 62,76,025 ఖాతాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో 4 కోట్లకు మించిన జన్-ధన్ ఖాతాలున్నాయి. వీటిలో 3 కోట్లకు మించిన ఖాతాలలోనే లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఖాతాల్లో రూ. 9100 కోట్ల జమ అయ్యాయి.
The post ఆగిపోతున్న 63 లక్షల ప్రధానమంత్రి జన్-ధన్ యోజన ఖాతాలు, కారణం ఏంటో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2XV8EG7
No comments:
Post a Comment