etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, July 5, 2019

అల్లు అర్జున్ 7 కోట్ల పెట్టి తాయారు చెయి౦చుకున్న కార్ వ్యాన్ ఎలా ఉందొ చుడండి.

అల్లు అర్జున్ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. మరియు చిరంజీవి మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు. కేరళ లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీ ని మల్లు అర్జున్ అని పిలుస్తారు. అయితే స్టైలిష్ స్టార్ అర్జున్ తాను వాడే ప్రాప‌ర్టీస్ ప్ర‌తీది చాలా స్టైలిష్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. ఇటీవ‌ల‌ అత‌ని కారవాన్‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో ప‌లువార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. ముంబైకి చెందిన వ్య‌క్తితో ప్ర‌త్యేకంగా మూడు కోట్లు పెట్టి ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్ చేయించాడ‌ని, ఈ కార్ వ్యాన్ ధ‌ర రూ. 7 కోట్ల పై మాటే అని అన్నారు. ఈ వార్త అప్ప‌ట్లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా బ‌న్నీ త‌న ట్విట్ట‌ర్‌లో పాల్కన్‌ కంపెనీకి చెందిన‌ కారవాన్‌ ఫోటోలు షేర్ చేశాడు. ఇంటీరియ‌ర్‌ని చూసి అభిమానులు అవాక్క‌వుతున్నారు. ముంబైకి చెందిన ప్ర‌ముఖ డిజైన‌ర్ అల్లు అర్జున్ టేస్ట్‌కి త‌గ్గ‌ట్టు ఇంటీరియ‌ర్‌ని డిజైన్ చేశార‌ని అంటున్నారు. అయితే త‌న కారవాన్ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన బ‌న్నీ.. జీవితంలో పెద్ద స్ధాయిలో ఏది కొన్నా.. నా మ‌దిలో ఒక‌టే మెదులుతుంది. అభిమానులు నా పైన చూపించే ప్రేమ‌, ఆద‌ర‌ణ కారణంగానే ఇది సాధ్య‌మ‌వుతుంది. నా మీద ప్రేమ చూపిస్తున్న అందరికీ రుణపడి ఉంటాను. ఇది నా వ్యానిటీ వ్యాన్ అని బ‌న్నీ త‌న ట్వీట్‌లో తెలిపాడు

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా త‌ర్వాత బ‌న్నీ త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. చిత్రం ప్ర‌ధాన పాత్ర‌ధారులు అంద‌రు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ట‌బు, స‌త్య‌రాజ్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. అల్లు అర్జున్ 19వ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

The post అల్లు అర్జున్ 7 కోట్ల పెట్టి తాయారు చెయి౦చుకున్న కార్ వ్యాన్ ఎలా ఉందొ చుడండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2FULpl7

No comments:

Post a Comment