etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, July 5, 2019

ఇల్లు కొనుక్కునే వారికీ అద్దిరిపోయే వార్త చెప్పిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, అదేంటో తెలుసా …?

పట్టణ ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణం, జీరో బేస్డ్ వ్యవసాయం, రైల్వేల ప్రైవేటీకరిస్తారనే ఊహాగానాలకు చెక్ పెట్టడం, సెబీ ఆధ్వర్యంలో సోషల్ ఫన్నింగ్ కోసం స్టాక్ ఎక్చేంజ్ తరహా వ్యవస్థ, చిన్న తరహా పరిశ్రమల కోసం కోటి రూపాయల వరకు రుణాల పరిధిని విస్తరించడం లాంటివన్నీ రాజకీయ పునాదులన్నీ విస్తరించే ప్రతిపాదనలు అనుకోవాలి. గాంధీ ఐడియాలజీని నేటి తరానికి అందించేందుకే అంటూ వీకీపీడియా తరహాలో గాంధీపీడియాను విస్తరింపచేస్తామనడం రాజకీయ వ్యూహంలో భాగమే. మొత్తంగా రాజకీయ వ్యూహాన్ని చాలా వరకు ఆర్థిక అవసరాలను, అన్నింటికి మించి మిడిల్ క్లాస్ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని నిర్మల ముక్కోణపు వ్యూహాన్ని అనుసరించినట్లు కనిపించాయి. స్టార్టప్ కోసం ప్రత్యేక ఛానల్‌ను ప్రారంభిస్తామని చెప్పడం ద్వారా యువతపై మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారనిపిస్తోంది.

మధ్యతరగతి గృహ రుణాలపై కాస్త ఊరట లభించింది. మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చారు. రూ.45లక్షలులోపు గృహరుణాల తీసుకునే వారికి రూ.3.5లక్షలు వరుకు వడ్డీ రాయితీ ఉంటుంది. ఇనాళ్ళు రూ.2లక్షలుగా ఉన్న వడ్డీ రాయితీని రూ.3.50లక్షలకు పెంచారు. ఎఫ్‌డీఐల ఆకర్షణకు భారత ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతాం, విదేశీ పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానం, ఎలక్ట్రిక్‌ వాహనాల సబ్సిడీ కోసం స్పెషల్ లాబీయింగ్‌., ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు, వాహనాలు కొనేవారికి రాయితీలు కల్పిస్తాం, ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా సాగుతున్నాం
రైల్వేల్లో 50లక్షల కోట్ల పెట్టుబడి అవసరముంది, మెట్రోరైలు సర్వీసులు ఇప్పటి వరకూ దేశంలో 657కి.మీ. మెట్రో మార్గం ఉంది, ప్రధానమంత్రి సడక్‌ యోజన, ఉడాన్‌, పారిశ్రామిక కారిడార్‌, రవాణాకు, రైల్వేలు ఇతర మార్గాలను నిర్మిస్తున్నాం, మహత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా అంత్యోదయ పథకం మరింత విస్తరణ, ఇళ్ల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచుతాం. ఆదర్శ అద్దె విధానం త్వరలోనే అమలు చేస్తాం, అందరికీ ఇల్లు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నాం. 1.9కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోంది.

The post ఇల్లు కొనుక్కునే వారికీ అద్దిరిపోయే వార్త చెప్పిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, అదేంటో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/3297jux

No comments:

Post a Comment