etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, July 7, 2019

అతిత్వరలోనే రాజకియలోకి మహేంద్ర సింగ్ ధోని, ఏ పార్టీలోకి వెళ్తాడో తెలుసా …?

ధోని ఆయన 1981 జూలై 7 న జన్మించాడు. ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు మరియు పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు ప్రస్తుత సారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరియు వికెట్ -కీపర్, అతను విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడిగా భావించబడుతాడు. అతను తన తొలి వన్ డే ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్తో డిసెంబరు 2004 లో ఆడాడు., మరియు శ్రీలంకతో ఒక సంవత్సరం తరువాత తన తొలి టెస్ట్ ఆడాడు. అయితే వరల్డ్‌ కప్‌ తరువాత క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి.. ధోనీ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడా..? ఇప్పటికే బీజేపీకి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడా.. క్రికెట్‌లో ధనాధన్‌ ఆటగాడిగా.. కూల్‌ కెప్టెన్‌గా ముద్ర వేసుకున్న మహేంద్రుడు.. రాజకీయాలను ఏలేందుకు సై అంటున్నాడా..? బీజేపీ వర్గాలు మాత్రం ధోనీ కచ్చితంగా తమ పార్టీలో చేరుతాడు అంటున్నాయి..ఇటీవల ధోనీ రిటైర్మెంట్‌పై ప్రచారం ఊపందుకుంది. ఈ వరల్డ్‌ కప్‌లో భారత్ ఆడేదే ధోనికి చివరి మ్యాచ్‌ అని వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే తానెప్పుడు రిటైర్‌ అవుతానో తనకే స్పష్టత లేదని తన రిటైర్మెంట్‌ ఊహాగానాలపై ధోనీ స్పందించాడు. వాటి సంగతి అలా ఉండగానే.. రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ రాజకీయాల్లో చేరుతాడనే ప్రచారం మొదలైంది.

ఈ ఏడాది అక్టోబరులో జార్ఖండ్‌ శాసనసభకు జరిగే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తాడని.. సండే గార్డియన్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి రాగానే ధోనీ బీజేపీలో చేరుతాడని ఆ కథనంలో రాసింది. బీజేపీ సర్కారుపై జార్ఖండ్‌ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.పార్టీపై ఉన్న అసంతృప్తి పోగొట్టుకోవాలి అంటే.. రాష్ట్రానికే చెందిన ధోనీని బీజేపీ తెరపైకి తెస్తోందనే ప్రచారం సాగుతోంది. బీజేపీలో చేరుతానని ధోనీ హామీ ఇచ్చినట్టు రాష్ట్ర నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర నేతలు సైతం అతడితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

The post అతిత్వరలోనే రాజకియలోకి మహేంద్ర సింగ్ ధోని, ఏ పార్టీలోకి వెళ్తాడో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2FYeZ9s

No comments:

Post a Comment