సాదారణంగా డిప్రెషన్ కి గురి అయినప్పుడు ఏ పని చేయాలని అనిపించదు. అలా ఖాళీగా కూర్చుంటే డిప్రెషన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. రోజు వారి పనులను పూర్తి చేయండి. అలాగే వాయిదా వేసిన పనులు ఉంటే వాటిని కూడా పూర్తి చేయండి. పనిలో పడితే మీ ఆలోచనల్లోనూ, మీ మూడ్ లోను మార్పు వచ్చే అవకాశం ఉంది. పచ్చదనం కంటికే కాదు మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బాగా డిప్రేస్ లో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న పార్క్ లేదా పచ్చని ప్రదేశాలకు వెళ్ళండి. ఏకాంతంగా వెళ్ళితే ప్రకృతిని ఆస్వాదించవచ్చు. డిప్రెషన్ కి గురి అయినప్పుడు మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం అమలు చేయాలి. ఆధ్యాత్మకత కొంతవరకు మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. తరచూ దేవాలయాలకు వెళ్ళటం,పురాణ గ్రంధాలను చదవటం వంటివి చేస్తే కొంతవరకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అయితే ఇవి కేవలం డిప్రెషన్ దూరం చేసుకోవటానికి ఒక మార్గంగా పనిచేస్తాయి కానీ చికిత్సగా మాత్రం పనిచేయవని నిపుణులు చెప్పుతున్నారు.
అయితే శరీరంలో సెలీనియం తక్కువైతే డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. దీనికి ముడి ధాన్యా లు, సీ ఫుడ్ పాటు మేక లేదా కోడి కాలేయం తినాలి. విటమిన్ డి లోపం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఉదయపు ఎండలో తిరగడం, చేపలు, పుట్టగొడుగులూ తినాలి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాల లోపం డిప్రెషన్‍కి దారితీస్తుంది. చేపలు, అవిసె, బాదం, పిస్తా, వాల్ నట్స్ లో ‘విటమిన్- డి’ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తినొచ్చు. విటమిన్ బి 12, విటమిన్ బి9 లోపం వల్ల కూడా డిప్రెషన్‍కి గురవుతారు. పాలు, గుడ్లు, చేపలతో పాటు ఆకు కూరలు, పండ్లు, బీన్స్ వంటివి తీసుకోవాలి. ట్రిప్టోఫా న్ అనే ప్రొటీన్ ఒత్తిడిని తగ్గించే సెరటోనిన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది బీన్సు , పప్పు దినుసుల్లో ఉంటుంది. అవి తింటే మేలు.
The post మీరు డిప్రెషన్ లో ఉన్నారా …? అయితే ఇలా చేస్తే సింపుల్ గా బయటపడవచ్చు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2NDlmW7
No comments:
Post a Comment