చక్కెర వ్యాధి బారినపడిన వారు కూరగాయలు ఎక్కువగా తినాలి. దీనివల్ల ఆహారంలో ఉండే పీచుపదార్థం ఎక్కువగా ఉండి చక్కెరను నియంత్రిస్తుంది. అంటే కేవలం షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం ఒక్కటే కాదు.. ఇలా చేయడం వల్ల అనేక వ్యాధుల బారినపడకుండా తప్పించుకోవచ్చు. ప్రధానంగా గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, వంటి పెద్దపెద్ద విపత్తులకు దూరంగా ఉండొచ్చు. కనీసం వీటి బారినపడకుండా ఎక్కువకాలం మనుగడ కొనసాగించవచ్చు. అలాగే, సమయానికి సమతుల ఆహారం తీసుకున్నట్టయితే అనారోగ్యం బారినపడకుండా ఉండొచ్చు. దీంతోపాటు వ్యాయామం, కంటినిండ నిద్ర కూడా తోడైతే మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే ఉంటుందని చెప్పొచ్చు.
అయితే భారతీయులు నిత్యం ఉల్లిపాయ లేనిదే ఏ కూరా చేయరు. ముఖ్యంగా నాన్‌వెజ్ వంటకాల్లో చక్కని వాసన, రుచి రావాలంటే ఉల్లిపాయలదే కీలకపాత్ర. అయితే ఉల్లిపాయలు కేవలం రుచికే కాదు, మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందివ్వడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే ఉల్లిపాయలను రోజూ తింటే షుగర్ బాగా తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది.
100 గ్రాముల ఎర్ర ఉల్లిపాయలను తింటే కేవలం 4 గంటల్లోనే షుగర్ తగ్గుతుందట. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఉల్లిపాయలను తింటే వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి తద్వారా షుగర్ కూడా కంట్రోల్ అవుతుందట. ఈ విషయాన్ని ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ ఇన్‌సైట్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు. 100 గ్రాముల ఎర్ర ఉల్లిపాయలను తింటే 4 గంటల వ్యవధిలో బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుందని సైంటిస్టులు తేల్చారు. కనుక టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు రోజూ ఎరుపు రంగులో ఉండే పచ్చి ఉల్లిపాయలను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
The post షుగర్ ఉన్న వాళ్ళు ఇలా తిన్నండి, దెబ్బకి షుగర్ వ్యాధి తగ్గుతుంది, ఎలానో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Ji0jEp
No comments:
Post a Comment