etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, July 12, 2019

నిన్న బడ్జెట్ సమావేశంలో కునుకుతిసిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. వీడియో

బడ్జెట్ గురించి వివరించే ముందు తమ మేనిఫెస్టో లక్ష్యాలను ఆయన వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా,అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్దే తమ లక్ష్యం అని చెప్పారు. గోదావరి జలాలను తీసుకువచ్చి కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.రాయలసీమకు నీరు అందిస్తామని చెప్పారు.గత పాలనలో రెండంకెల వృద్దిరేటు సాధించామని చెబుతున్నప్పటికీ.. పేదరికం,నిరుద్యోగం,రైతు ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. ఆ వృద్ది రేటులో నిజానిజాలను నిర్దారించే పనిలో ఉన్నామని చెప్పారు. అయితే మాజీ మంత్రి నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశాడు.

ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ పై, నాయకులపై సోషల్ మీడియా వేదికగా ట్విటర్ లో విసుర్లు విసిరాడు. బడ్జెట్ పై వైసీపీ ప్రభుత్వం కోసిన కోతలకు, కేటాయించిన నిధులకు పొంతనే లేదని ఆయన అన్నారు. ఆ విషయం పక్కనే ఉన్న గౌరవ వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుందని, అందుకే ఆ పార్టీ నేతలే గుర్రుపెట్టి నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వింటున్న సొంత నేతలే నిద్రపోతుంటే.. ఇక సీఎం గారి హామీలన్నీ గుర్తుంచుకొని, బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో? అని లోకేశ్ ప్రశ్నించాడు. ఈ రోజు అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో.. వైసీపీ నేత, ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పక్కన ఉండి ఆవలిస్తున్నారు. ఈ దృశ్యాలపై లోకేశ్ ట్విటర్ లో సెటైర్లు వేశారు.

The post నిన్న బడ్జెట్ సమావేశంలో కునుకుతిసిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. వీడియో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2jEArsl

No comments:

Post a Comment