కిమ్ శర్మ ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రచార కర్త. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కు కజిన్ అయిన కిమ్ శర్మ, ఆదిత్య చోప్రా సహకారం తో మొహబతీన్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. 2002లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం చిత్రం తో తెలుగు తెరకు పరిచయమయింది. అయితే పబ్లిసిటీ కోసం బాలీవుడ్ సెలెబ్రిటీలు ఏం చేయడానికైనా వెనుకాడరు. తాజాగా బాలీవుడ్ భామ కిమ్ శర్మ ముంబై నగరంలోని బాంద్రా వీధుల్లో అర్ధరాత్రి ఆటో రిక్షాలో చక్కర్లు కొట్టారు. రెడ్ గ్రే టీ షర్ట్, డెనిమ్ సమ్మర్ షార్ట్స్ ధరించి ఎంచక్కా ఆటోలో కూర్చుని కిమ్ శర్మ ఫోటో జర్నలిస్టులకు ఫోజులు ఇచ్చారు. కిమ్ తన ముఖం దాచుకునేందుకు ప్రయత్నించినా ఫోటోగ్రాఫర్లు మాత్రం ఆమెను తమ కెమెరాల్లో క్లిక్‌మనిపించారు.
గతంలో బాలీవుడ్ స్టైలిష్ హీరో హర్షవర్ధన్ రాణేతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచిన కిమ్ శర్మ ఆ తర్వాత అతడితో బ్రేకప్ చెప్పేశారు. యష్ రాజ్ ఫిల్మ్స్ మెహబ్బతీన్ మూవీలో తన అమాయక ముఖంతో ఆమె లక్షలాది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కిమ్ శర్మ చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు.
The post అర్ధరాత్రి ఆటోలో ఒంటరిగా హిరోయిన్, ఆ హిరోయిన్ ఎవరో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2XD9uYK
No comments:
Post a Comment