etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, August 2, 2019

నేటి నుంచి విండీస్‌తో భారత్‌ టీ20 సిరీస్‌, విండీస్‌కు భారీ ఎదురుదెబ్బ.

ప్రపంచకప్‌ హంగామా ముగిసింది. ఇక ఆయా జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లపై దృష్టి సారించాయి. ఇప్పటికే యాషెస్‌తో ఆసక్తికర సమరం ఆరంభం కాగా.. దీనికి పూర్తి విభిన్నంగా ధనాధన్‌ పోరుకు తెర లేవనుంది. వరల్డ్‌క్‌పలో అంచనాలు అందుకోలేకపోయిన టీమిండియా శనివారం నుంచి వెస్టిండీస్‌తో పొట్టి ఫార్మాట్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. భారత సూపర్‌స్టార్లతో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు. అటు టీ20 స్పెషలిస్టులుగా పేరున్న విండీస్‌ వీరులు తమకు మాత్రమే సాధ్యమయ్యే ఆటతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక అభిమానులంతా పరుగుల వినోదాన్ని ఆస్వాదించడమే తరువాయి. అంతేకాదు.. ఈ టూర్‌తో జట్టులోని పలు సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని టీమిండియా ఆశిస్తోంది.

తమ ఆటగాళ్ల ప్రదర్శనతో ఈ సిరీస్‌ రంజుగా సాగనుందని విండీస్‌ కోచ్‌ ఫ్లాయిడ్‌ రీఫర్‌ ఇప్పటికే చెప్పాడు. డాషింగ్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ జట్టులో లేకపోయినా ఆకాశమే హద్దుగా చెలరేగేందుకు పొలార్డ్‌, బ్రాత్‌వైట్‌, నరైన్‌, హెట్‌మయెర్‌, పూరన్‌ సిద్ధంగా ఉన్నారు. టీ20ల్లో ఈ జట్టు ఎంత ప్రమాదకారో ప్రత్యర్థి జట్లకు చెప్పాల్సిన పనిలేదు. గాయంతో బాధపడుతున్న ఆండ్రీ రస్సెల్‌ను జట్టులోకి ఎంపిక చేసినా ఫిట్‌నెస్‌ లేకపోవడంతో అతడు సిరీ్‌సకు దూరమయ్యాడు. రస్సెల్‌ స్థానంలో జేసన్‌ మహమ్మద్‌కు చోటిచ్చారు. ఆల్‌రౌండర్‌గా జట్టులో కొచ్చిన సునీల్‌ నరైన్‌ దాదాపు రెండేళ్ల క్రితం చివరి టీ20 ఆడాడు. అయితే ఆ సమయంలో తన బౌలింగ్‌ శైలిని మార్చుకోవడంతో పాటు బ్యాట్స్‌మన్‌గానూ సత్తా చాటుకోవడంతో అతనిపై విండీస్‌కు భారీగానే ఆశలున్నాయి.

The post నేటి నుంచి విండీస్‌తో భారత్‌ టీ20 సిరీస్‌, విండీస్‌కు భారీ ఎదురుదెబ్బ. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2YF9Ygz

No comments:

Post a Comment