etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, August 2, 2019

220 నుంచి 130రూ కి తగ్గిన కేబుల్‌ టీవీ చార్జీలు, ఎక్కడో తెలుసుకోండి.

మానవ నిర్మిత కృత్రిమ కొన్ని ప్రసారా సాధనల ద్వారా ప్రసారా మాద్యమాల ద్వారా ప్రసారాలు కొందరు ఉపగ్రహం కి పంపిన, మరి కొందరు కొన్ని ప్రసారా సాధనల ద్వారా అందుకున్న టీవీ సిగ్నలును కేబులు వైర్ల ద్వారా టీవీలకు కలిపినచో ఆయా చానల్స్ టీవీలో వచ్చేల చేయుదానినే టీవీ చానళ్ళూ ఇంటింటికీ అందించే వ్యవస్థను కేబుల్ టీవీ అంటారు. నవీన యుగంలో టీవీ ప్రధాన వినోద సాధనంగా మారింది. భారత్‌లో టీవీ ప్రసారాలను 1972 లో (టెర్రెస్ట్రియల్)పద్ధతిలో ఢిల్లీ లో చిన్నగా భూస్థిత నెట్ వర్క్ ను ప్రస్తుతం దూదదర్శన్ ప్రారంబించి, 1984 నాటికల్లా కలర్ ప్రసారాలను ప్రవేశపెట్టారు.

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కేబుల్‌ టీవీ సంస్థ నెలచార్జీని రూ.130కి తగ్గించింది. ప్రజలు తక్కువ చార్జీతో కేబుల్‌ టీవీ సేవలు పొందేలా ప్రభుత్వ కేబుల్‌ సంస్థకు 2011లో జయలలిత పునరుజ్జీవనం కల్పించారు. చందాదారులకు ప్రతి నెలా రూ.70 చార్జీతో 100 చానెళ్లు ప్రసారం చేశారు. అనంతరం కేబుల్‌ ప్రసారాలు స్పష్టంగా ప్రజలు తిలకించేలా కేంద్ర ప్రభుత్వం నుంచి డిజిటల్‌ ప్రసార హక్కును పొంది 2017 సెప్టెంబరు 1వ తేదీన డిజిటల్‌ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. కేబుల్‌ టీవీ సంస్థ ఇప్పటి వరకు 36లక్షల సెటాప్‌ బాక్స్‌లను కొనుగోలు చేసి 35.12 లక్షల మంది చందాదారులకు ఉచితంగా అందజేసింది. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఇష్టపడే చానళ్లను జీఎస్‌టీతో కలిసి రూ.220 చార్జీతో 191 చానెళ్లను ప్రసారం చేస్తున్నారు. ఈ చార్జీని తగ్గించాలన్న ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రూ.130కి తగ్గించింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ కొత్త చార్జీలు అమలుకు వస్తాయని అధికారులు తెలిపారు.

The post 220 నుంచి 130రూ కి తగ్గిన కేబుల్‌ టీవీ చార్జీలు, ఎక్కడో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2YDnyNp

No comments:

Post a Comment