ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేయలేదని, అందులోని 35ఏ వంటి నిబంధనలను మాత్రమే రద్దు చేసిందని మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తెలిపారు. సోమవారం ఆయన సుప్రీంకోర్టులో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టికల్ 370 సెక్షన్ 3 జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడమే కాదు, ఆ హోదాను ఏ సమయంలోనైనా ఒక ఉత్తర్వుతో రద్దుచేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చిందని తెలిపారు. ఈ నిబంధన ద్వారానే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ఉత్తర్వును కేంద్రం తెచ్చుకోగలిగిందని వివరించారు. రాజ్యాంగంలోని నిబంధనలను కేంద్రం పూర్తిగా వినియోగించిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్ విభజనకు 2, 3 అధికరణలను ఉపయోగించుకుందంటూ ఈ ప్రక్రియను ‘పెద్ద సర్జరీ’గా ఆయన అభివర్ణించారు.
కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కలిగించే 370వ అధికరణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ ఆర్టికల్‌లోని నిబంధనలనే వాడుకోవడం ఓ విశేషం. ‘మేం 370ని రద్దు చేయడం లేదు.. ఆర్టికల్ 370 అనేది అధికారాలనిచ్చే చట్టం. భారత రాజ్యాంగంలోని ఏ భాగాలు జమ్మూ కశ్మీర్‌కు వర్తిస్తాయో మాత్రమే అది చెబుతుంది. అదే అధికరణంలోని మూడో నిబంధన, ఆ రాష్ట్రంపై భారత రాజ్యాంగ పరిధిని మార్చే అధికారాన్ని రాష్ట్రపతికి కల్పిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు అనేది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యం. మేం రాజ్యాంగ సవరణ చేయడం లేదు.
ఆర్టికల్ 370 లో పేర్కొన్న కొన్ని అంశాలను అమలు చేయకుండా నిలిపేసే లేదా అంశాలను సవరించే అధికారం అదే ఆర్టికల్‌లోని మూడో నిబంధన అంటే 370 (3) ప్రకారం రాష్ట్రపతికి ఉంది…. ఓ రాజ్యాంగ ఉత్తర్వు ద్వారా రాష్ట్రపతి దీన్ని చేయవచ్చు’’ అని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 కింద గతంలో చేసిన అన్ని ఉత్తర్వులనూ తాజా ఉత్తర్వు రద్దు చేస్తుందని ఆయన వివరించారు. ‘నిజానికి ఇది మేం మొదటిసారిగా చేస్తున్నది కాదు. 1952, 1962ల్లో కాంగ్రెస్ పార్టీ చేసినదే. కాంగ్రెస్ మార్గాన్నే మేమూ అనుసరించాం’ అని ఆయన కాంగ్రె్‌సను సంకటస్థితిలోకి నెట్టారు.
The post ఆర్టికల్ 370 రద్దు కాలేదు, కాకపోతే ఈ విషయం తెలియక అందరు రద్దు అంటున్నారు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2KyDATV
No comments:
Post a Comment