etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, August 6, 2019

అమ్మాయి వేషంలో డ్రగ్‌ మాఫియా డాన్‌, పోలీసులు ఎలా పట్టుకున్నారో చుడండి.

మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని పదార్ధాలును డ్రగ్స్ అని అంటారు, మాదక ద్రవ్యాలలో వివిధ రకాలున్నాయి. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్.ఎస్.డి. మొదలైనవి ముఖ్యమైనవి.మాదక ద్రవ్యాలు నల్ల బజారులో అందుబాటులో ఉంటున్నాయి. వీనికి వివిధ ప్రాంతాలలో సంకేత నామాలతో చలామణీ అవుతుంటాయి. ఇలా అక్రమ వ్యాపారాలు దొంగ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల్ని గడిస్తుంటే, యువత వానిని వినియోగిస్తూ చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తుంది. అయితే డాన్‌లలో డ్రగ్‌ మాఫియా డాన్‌ల రూటే సపరేటంటూ బ్రెజిల్‌లోని జైలులో ఉన్న ఓ డ్రగ్‌ మాఫియాడాన్‌కు ఓ ఐడియా వచ్చింది. అచ్చం తన టీనేజర్‌ కూతురులా రెడీ అయి జైలు నుంచి తప్పించుకోవాలనేది అతని ప్లాన్‌. కానీ చివరి నిమిషంలో అమ్మాయిలా నటించడంలో మాత్రం సక్సెస్‌ కాలేక ‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు. 42 సంవత్సరాల క్లౌవినో డ సిల్వా బ్రెజిల్‌ దేశంలో పేరుమోసిన డ్రగ్‌ మాఫియాకు నాయకుడు. ఇతడు ప్రస్తుతం రియోడిజెనిరో నగరంలోని సెంట్రల్‌ జైలులో 73 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే రకరకాల ఎత్తులు వేసినా పారలేదు.

దీంతో ఏకంగా తన కూతురుని ఉపయోగించుకొని పారిపోవాలని భారీ స్కెచ్‌ వేశాడు. తనను కలవడానికి వచ్చిన 19 ఏళ్ల కూతురిని లోపలే ఉంచి అప్పటికే సిద్ధం చేసుకున్న టీషర్ట్‌, సిలికాన్‌మాస్క్‌, కళ్లజోడు, విగ్‌లతో అచ్చం కూతురిలా రెడీ అయి బయటకు వచ్చాడు. పాపం జైలు ఆవరణలోని పోలీసులు కూడా ఇతన్ని చూసి అమ్మాయే అనుకొని పొరపాటుపడ్డారు. దీంతో గేటు వరకూ వచ్చాడు. దాదాపు బయటకు వెళ్లే సమయంలో గేటు దగ్గర చివరి తనిఖీల్లో భాగంగా పోలీసులు చెక్‌ చేస్తుండగా మనోడు అమ్మాయిలా మరీ మెలికలు తిరిగిపోయాడంటా. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి అవాక్కయ్యారు. అతడి ఒక్కొక్క మేకప్‌ తీయమని చెప్తూ వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మేకప్‌ తీసేస్తున్నప్పుడు మనోడి కాన్ఫిడెన్స్‌ చూస్తే దిమ్మతిరగాల్సిందే. ఇంతకీ ఇన్ని వస్తువులు ఎలా వచ్చాయబ్బా అని ఆరా తీయగా గర్భిణి వేషంలో అంతకుముందే ఓ మహిళ ఇతడిని కలిసి వెళ్లిందని తెలిసింది. మధ్యలో ఈ పాడు సిగ్గు అడ్డురాకుండా ఈ కొ(చె)త్త ఐడియా సక్సెస్‌ అయి ఉంటే ఇప్పుడు ట్విటర్‌లో ఎగిరే బదులు హాయిగా ఏ డాన్‌ సెట్‌లోనో కూర్చునేవాడేమో!

The post అమ్మాయి వేషంలో డ్రగ్‌ మాఫియా డాన్‌, పోలీసులు ఎలా పట్టుకున్నారో చుడండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/33hOTIE

No comments:

Post a Comment