ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది.. ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే.మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది.
అయితే ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ ను ప్రత్యేకంగా కలుసుకునే అవకాశం కల్పిస్తామంటూ యువ పారిశ్రామికవేత్త నుంచి రూ.60 లక్షలు వసూలు చేసి, మోసగించిన తమిళ సినీనిర్మాత శరవణకుమార్ కటకటాల పాలయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. రామనాథపురానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు(27) ఇంటర్నెట్‌లో ఓ వెబ్‌సైట్ చూస్తుండగా సినీతారల అశ్లీల చిత్రాలు కనిపించాయి. వాటిపై అతను క్లిక్ చేయడంతో కాజల్ అగర్వాల్‌ను ప్రత్యేకంగా కలుసుకోవాలనుకుంటే రూ.50వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించమని సందేశం వచ్చింది. సైట్ నిర్వాహకులు సూచించిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేసినప్పటినుంచి అతడికి కష్టాలు మొదలయ్యాయి.
సైట్ నిర్వాహకులు మార్ఫింగ్ చేసిన అసభ్యకర ఫొటోలు, వీడియోలు పంపిస్తూ వాటిని అతని కుటుంబీకులకు కూడా పంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన అతను వారి ఖాతాలో మూడు విడతలుగా రూ.60 లక్షలు జమచేశాడు. ఆ ముఠా ఇంకా పెద్దమొత్తం డిమాండ్ చేయడంతో ఇంటినుంచి పారిపోయాడు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అ యువ పారిశ్రామికవేత్తను కోల్‌కతాలో గుర్తించి తీసుకొచ్చారు. అతను డబ్బు జమచేసిన ఖాతాదారు మణికంఠన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మణికంఠన్ ఇచ్చిన సమాచారం మేరకు సినీ నిర్మాతను అరెస్టు చేశారు.
The post కాజల్ ను కలిపిస్తా అని చెప్పి ఏకంగా 60లక్షలు వసూలు చేసిన సినీ నిర్మాత, ఎవరో తెలుసా …! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2ZpABTS
No comments:
Post a Comment