etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, August 15, 2019

ఈ ఛాయ్ ధర ఎంతో తెలుసా …! అక్షరాల రూ.75వేలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ….?

కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజలను ఎండబెట్టి వేగించి పొడి చేసి కాఫీ తయారీకి ఉపయోగిస్తారు. కాఫీగింజలను దాదాపు 70 దేశాలలో పండిస్తున్నారు. కాఫీ పంటను ముఖ్యముగా లాటిన్ అమెరికా, దక్షిణా ఈశాన్య ఆసియా మరియు ఆఫ్రికాదేశాలలో విస్తారంగా పండిస్తున్నారు. వేగించని పచ్చి కాఫీ గింజల వాణిజ్యము ప్రపంచంలో అత్యధికంగా జరిగే ప్రసిద్ధ వాణిజ్యాలలో ఒకటి. కాఫీ గింజలలో ఉన్న కాఫి అనే పదార్ధము మానవులను ఉత్సాహపరుస్తుందని ఊహించబడుతుంది. కాఫీ ప్రపంచంలో అత్యధికంగా సేవించే ఉత్తేజపూరితమైన పానీయము. కాఫీ అనేది ఒక ప్రసిద్ధ పానీయం. ప్రపంచ వ్యాప్తంగా అన్నిప్రాంతాలలో దొరికే ఈ పానీయం.

పెద్దల నుండి పిన్నల వరకు అనేకంగా అలవాటు పడిన ఉత్తేజాన్ని కలిగించే పానీయము. అయితే ప్రతి ఉదయం వంటింట్లోని ఛాయ్ ఘుమ ఘుమలతో మొదలవుతుంది. ఓ కప్పు వేడి వేడి కాఫీ తాగితే ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆ రోజు పనులు కాఫీ కప్పుతోనే మొదలవుతాయి. మాంచి వాసన వచ్చే స్ట్రాంగ్ ఛాయ్ కావాలంటే కిలో వెయ్యి వరకు ఉండొచ్చేమో అనుకుంటాం. కానీ ఛాయ్ పత్తీ ధరలు కూడా ఆకాశాన్నంటేస్తున్నాయి. వినియోగదారుడి టేస్ట్‌ని దృష్టిలో పెట్టుకుని రకరకాల ఛాయ్ పత్తీలు మార్కెట్లోకి వస్తుంటాయి. తేయాకు పంటకు ప్రసిద్ధి చెందిన అస్సాం రాష్ట్రంలోని దిబ్రుగార్ష్ జిల్లాలో ఉన్న దాకామ్ టీ ఎస్టేట్‌కు చెందిన టీ పౌడర్ కేజీ రూ.75 వేలు పలికింది.

గౌహతి ఆక్షన్ సెంటర్‌లో మంగళవారం ఈ రికార్డు నమోదైంది. ఎమ్మెస్ అస్సాం టీ ట్రేడర్స్ రూ.75 వేల రూపాయలకు ఈ టీ పౌడర్‌ని సొంతం చేసుకున్నారు. ప్రత్యేకంగా పండించే ఈ టీ ఎస్టేట్ మేనేజర్ సమర్ జ్యోతి చాలిహ మాట్లాడుతూ.. ఈ రోజు మా టీం చాలా సంతోషిస్తుంది. డికామ్ టీ ఎస్టేట్ రూ.75 వేలకు అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఏళ్లుగా నాణ్యమైన టీ పౌడర్‌ని అందిస్తున్నాం. మా కృషికి తగిన గుర్తింపు లభించింది అని అన్నారు.

The post ఈ ఛాయ్ ధర ఎంతో తెలుసా …! అక్షరాల రూ.75వేలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2YUUtSP

No comments:

Post a Comment