etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, August 3, 2019

దొంగతనానికి వచ్చిన దొంగ ఆవేదనతో దుకాణ యజమానికి లేఖ రాసిన దొంగ, చివరికి చిర్రెత్తుకొచ్చి ఏం చేసాడో చుడండి.

ప్రాణాలకు తెగించి దోపిడీకి వస్తే.. గల్లాపెట్టెలో కనీసం చిల్లర కూడా ఉంచరా? అంటూ ఓ దొంగ కిరాణాకొట్టు యజమానికి లేఖ రాసి వెళ్లిన వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. కడలూరు జిల్లా మందారకుప్పుం ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఓ దుకాణం పైకప్పును పెకలించుకుని ఆ దొంగ కిందకు దిగాడు. గల్లాపెట్టె ఖాళీగా కనిపించడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అక్కడున్న ఓ బిల్లు పేపర్‌పై… ‘ప్రాణాలకు తెగించి పైకప్పు తొలగించుకుని దోపిడీ చేసేందుకు వచ్చాను. గల్లాపెట్టెలో కనీసం చిల్లర కూడా ఉంచకుండా వెళతారా? నన్ను ఏమార్చినందుకే ఈ కోతి చేష్ట’ అంటూ స్కెచ్‌ పెన్‌తో లేఖ రాసి, గోడకు వేలాడదీసి వెళ్లాడు. దుకాణం యజమాని ఫిర్యాదుతో పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.

దొంగతనానికి వచ్చిన చోట చిల్లిగవ్వ దొరక్కపోవడంతో ఓ దొంగ చిర్రెత్తిపోయాడు. ఆ దుకాణ యజమానికి ఓ లేఖ రాసి చీవాట్లు పెట్టి వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కడలూరు జిల్లా మందారకుప్పంలో జయరామన్‌ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ దుకాణంపై ఓ దొంగ కన్నేశాడు. గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణం పై కప్పును తొలగించి లోపలికి వెళ్లాడు. ఉదయాన్నే దుకాణం తెరచిన జయరామన్‌ షాక్‌కు గురయ్యాడు. పైకప్పు దెబ్బతిన్నా దుకాణంలో వస్తువులు ఏమాత్రం చోరీకి గురి కాలేదు. అయితే కొన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వాటిని సరి చేస్తుండగా ఓ లేఖని గుర్తించాడు. ప్రాణాలను పణంగా పెట్టి అతి కష్టం మీద దొంగతనానికి వస్తే గల్లాలో చిల్లిగవ్వ కూడా పెట్టవా? అని అందులో యజమానిని దొంగ ప్రశ్నించాడు. దొంగతనం చేయడం అంత సులభం కాదని..ఎంతో కష్టపడాల్సి ఉందని ఇక్కడున్న పప్పుదినుసులను పట్టుకెళ్లి తానేమి చేసుకోవాలని విచారం వ్యక్తం చేశాడు. ఈ లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

The post దొంగతనానికి వచ్చిన దొంగ ఆవేదనతో దుకాణ యజమానికి లేఖ రాసిన దొంగ, చివరికి చిర్రెత్తుకొచ్చి ఏం చేసాడో చుడండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/335jbyh

No comments:

Post a Comment