ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బుందేల్‌ఖండ్ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. యుపిలోని ఏడు జిల్లాలు, మధ్యప్రదేశ్‌లోని 12 జిల్లాలలతో కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బుందేల్‌ఖండ్ ముక్తి మోర్చా డిమాండ్ చేస్తోంది. యుపి నుంచి విడదీసి పుర్వాంచల్, బుందేల్‌ఖండ్, హరితప్రదేశ్ రాష్ట్రాలను ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తున్నారు, అయితే వీటిలో దశాబ్దాలుగా వినిపిస్తున్న బుందేల్‌ఖండ్ రాష్ట్రం డిమాండుకు కేంద్రం సుముఖంగా ఉందా? కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. బుందేల్‌ఖండ్‌పై ప్రభుత్వ యోచన కార్యరూపం దాల్చితే అది దేశంలో 30వ రాష్ట్రంగా అవతరించే అవకాశం ఉంది. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఆ తర్వాత వంతు బుందేల్‌ఖండ్‌దేనని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బుందేల్‌ఖండ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. కొండలు కోనలతో నిండిన ఇది ఉత్తర, మధ్యభారతంలో ఉన్న బాగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ విస్తారంగా సహజవనరులు ఉన్నప్పటికీ తగిన మౌలిక సౌకర్యాలు, అభివృద్ధి లేకపోవడంతో వెనుకబడిపోయింది. ఈ ప్రాంతం 2 రాష్ట్రాల్లో విస్తరించింది. మధ్యప్రదేశ్‌లో ఎక్కువగాను, యూపీలో తక్కువగానూ ఉంది. నిజానికి బుందేల్‌ఖండ్ రాష్ట్ర డిమాండుపై 1960 నుంచి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అయితే రాజకీయంగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ప్రభుత్వం దీన్ని తలకెత్తుకుంది. 2011లో నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి యూపీని 4 ముక్కలు చేయాలని, అందులో ఒక భాగాన్ని బుం దేల్‌ఖండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై యూపీ కేబినెట్ తీర్మానంకూడా ఆమోదించింది.
యూపీలోని ఏడు జిల్లాలు, మధ్యప్రదేశ్‌లోని ఆరు జిల్లాలను కలిపి బుందేల్‌ఖండ్‌ను ఏర్పరచాలన్నది మాయావతి ప్రతిపాదన. అయితే కేంద్రంలోని నాటి యూపీఏ సర్కారు నుంచి సానుకూల స్పం దన రాకపోవడంతో యూపీ పునర్విభజన అక్కడితో ఆగిపోయింది. బుందేల్‌ఖండ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. బుందేల్‌ఖండ్‌పై రాజకీయ పార్టీలు అడపాదడపా హామీలిస్తూనే ఉన్నాయి. కొత్త రాష్ట్రం కోసం బుందేలీ సమాజ్ కన్వీనరు తారా పాట్కర్, ఆయ న అనుచరులు గత 401 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తు న్నారు. తమ ప్రాంత ఎంపీల నిర్లక్ష్యానికి నిరసనగా 40 మంది ఆందోళనకారులు శుక్రవారం శిరోముండనం చేయించుకున్నారు.
The post అతి తొందరలోనే మరో రాష్ట్ర౦ ఏర్పాటుకు అడుగులు, అది ఏ రాష్ట్రమో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2LZ9CeO
No comments:
Post a Comment