13 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ ఆటపై దృష్టి పెట్టినాడు. చిన్న వయస్సులోనే అండర్-16 ఉత్తర ప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పదిహేనున్నర సంవత్సరాల ప్రాయంలో అండర్-19 జట్టుకు ఎంపైకై ఇంగ్లాండు పర్యటించి రెండు అర్థసెంచరీలు సాధించాడు.[2] ఆ తదుపరి సంవత్సరం అండర్-17 టీం తరఫున శ్రీలంక పర్యటించాడు. 2003లో 16 సంవత్సరాల వయస్సులోనే ఉత్తర ప్రదేశ్ తరఫున తొలిసారిగా రంజీ ట్రోఫి అస్సాంపై ఆడినాడు. ఆ తదనంతరం అండర్-19 ఆసియా కప్‌లో పాల్గొనడానికి పాకిస్తాన్ పర్యటించాడు. 2004లో అండర్-19 ప్రపంచ కప్ పోటీలలో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆ ప్రపంచ కప్ పోటీలలో కేవలం 38 బంతుల్లో 90 పరుగులు సాధించడమే కాకుండా మొత్తం 3 అర్థసెంచరీలు సాధించాడు. 2005 ప్రారంభంలో ఛాలెంజర్ సీరీస్‌కు ఎంపైకైనాడు. సచిన్ టెండుల్కర్ గాయపడటంతో 2005 లో శ్రీలంకలో జరిగిన ఇండియన్ ఆయిల్ కప్ లో పాల్గొన్నాడు.
అయితే సురేశ్ రైనా మోకాలికి సర్జరీ జరిగింది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఈ సీనియర్ హిట్టర్‌కి తాజాగా నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో శస్త్ర చికిత్స జరిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితోనే దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్న రైనా ఎట్టకేలకు సర్జరీ చేయించుకున్నాడు. దాంతో కనీసం నాలుగు నుంచి ఆరు వారాలపాటు రైనా క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. రైనా మోకాలికి శస్త్ర చికిత్స జరిగిన విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. త్వరగా రైనా కోరుకోవాలని ఆకాంక్షించింది.
భారత్ తరఫున గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన సురేశ్ రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్‌లో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతున్న ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు.. ఈ ఏడాది ముగిసి ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. మూడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో..ఈ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా ఈనెల 17 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుండగా శస్త్ర చికిత్స కారణంగా ఈ టోర్నీకి సురేశ్ రైనా దూరంగా ఉండనున్నాడు. 226 వన్డేలు ఆడిన రైరా 5,615 పరుగులు చేయగా, 78 అంతర్జాతీయ టీ20ల్లో 1,605 పరుగులు చేశాడు. ఇక 18 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రైరా 768 పరుగులు సాధించాడు.
The post హాస్పిటల్ లో సురేశ్ రైనా కు సర్జరీ, ఆ సర్జరీ ఎందుకు చేసారో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Tlw5n7
No comments:
Post a Comment