ఈ సృష్టిలో మానవ జన్మ చాలా పవిత్రమైనది. ఉత్కృష్టమైనది. ఎన్నో పుణ్యాలు చేస్తేనే ఈ మానవ జన్మ సిద్ధిస్తుంది. మానవ జీవిత చతుర్విధ ఆశ్రమాలమీద ఆధారపడి నడుస్తుంది. మనిషి మనుగడలో ఉన్న వివిధ స్థాయిలలోని తేడాను ‘ఆశ్రమ’ అనే పదం ఉద్భవించింది. ‘శ్రమ’ అనే ప్రాతిపదిక నుండి ఇది ఉద్భవించింది. ఎలా శ్రమించాలి? ఎచ్చటెచ్చట శ్రమించాలి? అనే విషయాలు వివరిస్తుంది. మానవుని జీవితాన్ని సక్రమ మార్గంలోనికి నడుపునదే ఈ ‘ఆశ్రమ’ జీవితం. బ్రహ్మచర్యం, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనేవి నాల్గు రకాలైన ఆశ్రమ ధర్మాలు. హిందూ పురాణము, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాల్లో వీటి గురించి వివరించారు.
అయితే కాయకష్టం చేస్తూ.. ఏ లోటూ రాకుండా అల్లారు ముద్దుగా పెంచిన ఆ కన్నతండ్రిని తనయులు గాలికొదిలేశారు. ముదిమి వయసులో ఆయన బాగోగులు చూసుకోవాల్సింది పోయి.. పోషణను పట్టించుకోలేదు. కష్టార్జితంతో ఆయన నిర్మించిన ఇళ్లలో ఉంటూ.. ఆ వృద్ధుడికి పట్టెడన్నం కూడా పెట్టలేదు. ఎన్నోవిధాలుగా వారిని వేడుకున్న ఆ పెద్దాయన.. చివరికి పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. తండ్రిని పట్టించుకోని ఆ తనయులకు చెంపపెట్టులాంటి తీర్పు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి-భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన బొడ్డు యాదగిరికి నలుగురు కుమారులు (బొడ్డు నర్సింహులు, బొడ్డు సుదర్శన్, బొడ్డు ఉపేందర్, బొడ్డు సత్యనారాయణ) ఉన్నారు.
ముదిమి వయసులో ఉన్న యాదగిరి పోషణను ఆ నలుగురూ విస్మరించారు. ఆయన ఆస్తిని అనుభవిస్తూనే.. నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరించారు. దీంతో బాధితుడు మే 24న ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. యాదగిరి కేసును విచారణకు స్వీకరించిన ట్రైబ్యునల్ చైర్మన్, భువనగిరి ఆర్డీవో జి.వెంకటేశ్వర్లు.. అతడి కుమారులకు సమన్లు జారీ చేశారు. జూలై 8న ట్రైబ్యునల్ చైర్మన్ ఎదుట హాజరైన యాదగిరి కుమారులు తమ తండ్రి పోషణకు నెలకు రూ. 10 వేలు ఇస్తామని పేర్కొన్నారు. దీనికి యాదగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘నేను నా కష్టార్జితంతో నిర్మించుకున్న ఇళ్లను తిరిగి ఇప్పించండి చాలు’’ అని వేడుకున్నారు. ఇరువర్గాల వాదనలను విన్న ఆర్డీవో.. గత నెల 23న తీర్పునిచ్చారు. ‘‘రాజపేట మండల కేంద్రంలోని మూడు ఇళ్ల (ఇంటి నెంబర్లు 7-47, 7-41, 7-51)ను వెంటనే ఖాళీ చేసి.. యాదగిరికి స్వాధీనం చేయాలి’’ అని ఆయన కుమారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచించారు.
The post మీ కొడుకులు మిమ్మల్ని చూడటం లేదా…! అయితే ఈ విషయం తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Tfx48B
No comments:
Post a Comment