తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మలికిపురంలో పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈరోజు ఆయన తన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నిన్న రాత్రి తెలిపారు. మలికిపురంలో పేకాడుతున్నట్టు వచ్చిన సమాచారంపై మలికిపురం ఎస్సై కేవీ రామారావు తన సిబ్బందితో వెళ్లి పేకాట శిబిరంపై దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేయగా వారు జనసేన పార్టీ వారుగా గృట్టించారు. రూ.37,700 నగదు, ఆరు మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అస్మీ మీడియాకు తెలిపారు. రాపాక వరప్రసాద్, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్ సంఘటన స్థలంలో ఎస్సై రామారావుతో గొడవపడి ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేసారని మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం తీసుకుంటే వీలు లేదని అయన గొడవపడి పోలీసులపై తిరగబడ్డారని పేర్కొన్నారు.
గెడ్డం తులసీభాస్కర్ ఎస్సైతో వాగ్వివాదానికి దిగి ఇష్టానుసారంగా దూషించినట్టు ఎస్సై తెలిపారు, కొందరు వ్యక్తులు ఎస్సై ఎమ్మెల్యేను నిందించినట్టు చెప్తూ దీంతో ఎమ్మెల్యే రాపాక, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్‌లు సుమారు 100 మంది అనుచరులతో స్టేషన్‌పై దాడి చేసి పోలీస్‌స్టేషన్‌పై రాళ్లు రువ్వుతూ కిటీకీ అద్దాలు పగలకొట్టి పోలీసుల విధులకు ఆటంక పరిచారని ఎస్పీ నయీం అస్మీ వివరించారు. డీఐజీ ఏఎస్ ఖాన్ ఆదేశాల మేరకు క్రైం నంబర్ 183/2019 కింద సెక్షన్లు 143, 147, 148, 341, 427, 149, అండ సెక్షన్ 3 కింద పీడీపీపీ యాక్ట్ అండ్ క్రిమినల్ ఎమైండ్‌మెంట్ యాక్ట్ కింద కేసు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతడి అనుచరులపై పెట్టినట్టు పోలీసులు తెలిపారు.
The post పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/307euSN
via IFTTT
No comments:
Post a Comment