విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. దాదాపు భవిష్యత్తు మొత్తం ఇక్కడే నిర్ణయమైపోతుంది. రోజురోజుకీ పోటీ తీవ్రమవుతునన్న ప్రస్తుత ప్రపంచంలో ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరితే ఏమవుతుంది? ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? అందుబాటులో ఉన్న కోర్సులేంటి? పదో తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలేమైనా ఉన్నాయా? ఇలా రకరకాల ప్రశ్నలు అందరినీ వేధిస్తుంటాయి. అరకొర సమాచారంతో… అందరి సలహాలతో… ఆందోళన చెందుతుంటారు. పరీక్షల్లో కొత్త విధానాన్ని తీసుకురావడంతో ఈ పద్ధతికి స్వస్తి పలకనున్నారు. విద్యార్థులు 100 మార్కులకు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ప్రతి పేపర్‌లో పది మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో బిట్ పేపర్ ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు.
హిందీలో వంద మార్కులు మినహాయించి పేపర్‌కు 40మార్కులు చొప్పున 2పేపర్లు కలిపి 80మార్కులకు ఉండగా ఇంటర్నల్ మార్కులు 20ఉండేవి. వాటిలో మార్పులు చేస్తూ పేపర్‌కు 50మార్కులు చొప్పున మార్పులు చేశారు. మార్కులు, ప్రశ్నలు పెరుగుతున్నందున పరీక్ష సమయాన్ని సైతం మార్పులు చేయనున్నారు. హిందీ, సంస్కృతం తప్పించి మిగిలిన సబ్జెక్టుల్లో ప్రతి పేపర్‌కు 2.30 గంటలు పరీక్ష రాయడానికి, 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి ఉంటుంది. హిందీ, సంస్కృతం 100 మార్కులకు ఉండనున్నందున పరీక్ష రాయడానికి 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు ఇవ్వనున్నారు. పదో తరగతి ప్రశ్నపత్రాన్ని నాలుగు భాగాలుగా విడదీస్తారు. ఒక్కో పేపర్లో ఎన్ని ప్రశ్నలు ఇవ్వనున్నారో ప్రశ్నపత్రం, బ్లూప్రింట్‌ను కూడా రూపొందించారు. ఈపాటికే దీన్ని విడుదల చేయాల్సి ఉన్నా అనుమతి రానందున పాఠశాలలకు పంపలేదు. ఒక్కో పేపర్ 50 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు బట్టీ పట్టి రాయకుండా సొంతంగా రాయగలిగేలా ప్రశ్నలు ఇస్తారు.
పరీక్షల్లో బిట్ పేపర్ వల్ల మాస్ కాపీయింగ్ బాగా జరుగుతోందని వస్తున్న సమాచారం వల్ల ఈ మార్పులు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ లో ఇలాంటి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే బిట్ పేపర్ రద్దు చేయాలని నిర్ణయించారు. బిట్ పేపర్ స్థానంలో అర మార్కు ప్రశ్నలు ఇవ్వనున్నారు. వీటిని విడిగా కాకుండా ప్రధాన ప్రశ్నపత్రంలోనే ఇస్తారు. ఇప్పటివరకు పదో తరగతిలో సబ్జెక్టుల్లోని రెండు పేపర్లు కలిపి 35 మార్కులు వస్తే చాలు పాస్ చేసేవారు. ఇక నుంచి అలా ఉండదు సబ్జెక్ట్ లోని రెండు పేపర్లలో ప్రతిదానిలోనూ పాస్ అవ్వాలని తెలిపారు. దీని ప్రకారం ప్రతి పేపర్‌లోనూ 17.5 చొప్పున మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇలా రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు వస్తేనే పాసైనట్లు అని తెలిపారు. పాత విధానంలో ఒక పేపర్‌లో 35 మార్కులు వచ్చి, రెండో దానిలో సున్నా వచ్చినా పాసవుతున్నారు. దీనివల్ల టీచర్లలో ఎవరు బాగా పాఠాలు చెబుతున్నారు.. ఎవరు చెప్పడం లేదు అనే విషయాలు తెలియడం లేదు. అందుకే ఇలా మార్పులు చేశారు.
The post పదో తరగతి విద్యార్థులు ఖచ్చితంగా తెల్సుకోవాల్సిన విషయాలు, లేకుంటే చాలా నష్టపోతారు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2KUaJtb
No comments:
Post a Comment