మనిషి పుట్టుక నుంచీ ఇప్పటివరకూ మానవుడికి జాతిభేదం లేకుండా కేవలం పెంపుడు జంతువుగా కాకుండా స్నేహితునిగా మారిన ఒకే ఒక జంతువు కుక్క. తొలి మానవుడు బట్ట కట్టుకోవటం నేర్చుకోక ముందే స్నేహం చేయటం నేర్చుకున్నాడు మొదటగా అతన్ని చేరిన జంతువు కుక్క తరువాత మనిషి పెంపుడు జంతువుల జాబితాలోకి చాలా జంతువులే వచ్చి చేరాయ్ శునకం.. అదిరే సాహసం చేసింది. చిరుతపులితో పోరాడి యాజమానురాలిని కాపాడింది. డార్జిలింగ్ సమీపంలోని సోనాడలో జరిగిన ఈ ఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ శునకం చిరుతపులి దాడి నుంచి యజమానురాలిని రక్షించి అందరి ప్రశంసలందుకుంటోంది.
అరుణ లామా అనే మహిళ ఇంట్లో ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దాని పేరు టైగర్. అయితే ఆగస్టు 14 రాత్రి అరుణ లామా తన ఇంటి కింది ఫ్లోర్‌లో రెండు కళ్లు మెరుస్తూ ఉన్న ఓ జంతువును చూసింది. అది చిరుతపులి అని తెలుసుకునేలోపే అది ఆమెపై దాడి చేసింది. ఒక్కసారిగా అరుణపై దూకి శరీరంపై రక్కేసింది. చిరుత యాజమానురాలిపై దాడి చేయడం చూసిన టైగర్ దాంతో పోరాడి తరిమికొట్టింది. శునకం అరుపులతో అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో ఉన్న అరుణ లామాను గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆమెకు చికిత్స చేసిన డాక్టర్లు నుదురు కుడివైపున 20కుట్లు, చెంపలపై ఐదు కుట్లు వేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందించారు. ఆ ప్రాంతంపై నిఘా పెట్టారు చిరుతపులిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
The post విశ్వాసం అంటే ఇది, తన యజమాని రక్షణ కోసం చిరుతతో పోరాడి గెలిచినా శునకం. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Mvuqer
No comments:
Post a Comment