etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, September 12, 2019

ఈ టిప్స్‌ తో 3 రోజుల్లో మీ పాదాల పగుళ్ళు మటుమాయం, ఎలానో తెలుసుకోండి.

ఆడ-మగ అనే భేదం లేకుండా పాదాలు పగిలి ఉండటం మనం తరచూ గమనిస్తూ ఉంటాం. ఇలా పగుళ్ళు రావటం వల్ల మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఇబ్బందికి గురౌతుంటారు. పాదాలకు పగుళ్ళు ఉన్నవారు ఖరీదైన క్రీములు కొని. అవి మీ చర్మ తత్వానికి పడక ఎలర్జీ రావటం మరియు కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవటం కంటే, మనకు అందుబాటులో ఉన్న ప్రకృతి వరాలని ఉపయోగించటం వలన ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతం చేసుకోవచ్చు. ఎలా ట్రై చేసి చూడండి మీరే మంచి ఫలితం పొందుతారు.

1. రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని పగుళ్ళున్న చోట దూదితో రాసి, కొంత సమయం తరువాత కడ‌గాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గుముఖం పట్టి పాదాలు మృదువుగా మారతాయి. దీన్ని కాళ్లకు కూడా రాసుకోవచ్చు.
2. బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దనా చేస్తే మడమలకున్న మురికి పోతుంది. క్రమంగా ఇలా చేస్తే మురికి తొలగడమే కాకుండా పగుళ్ళు కూడా దరి చేరవు.
3. పాదాలు మృదువుగా తయారవ్వాలంటే నాలుగు చెంచాల ఓట్ మీల్ పొడి, మూడు చెంచాల ఆలివ్ నూనె కలిపి మిశ్ర‌మంగా చేసి దాంతో మర్దనా చేయాలి. అనంతరం అరగంట ఆగాక చల్లని నీటితో కడగాలి. దీంతో మృతకణాలు(డెడ్ సెల్స్) కూడా తొలగిపోతాయి.
4. పావు బకెట్ నీళ్ళలో టీ స్పూన్‌ కొబ్బరి నూనె, టీ స్పూన్‌ వంటసోడా, టీ స్పూన్‌ విటమిన్ ఈ నూనె వేసి అరగంట సేపు కాళ్ళు అందులో ముంచేలా ఉంచాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున చేయడం ద్వారా పాదాలు మృదువుగా ఉంటాయి.
5. నువ్వుల నూనెను గోరు వెచ్చగా వేడి చేసి రాత్రి పడుకునే ముందు రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి.

The post ఈ టిప్స్‌ తో 3 రోజుల్లో మీ పాదాల పగుళ్ళు మటుమాయం, ఎలానో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2O2qTUD

No comments:

Post a Comment