etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, September 12, 2019

మీరు రాగి చెంబులో నీరు తాగితే, మీ శరీరానికి ఎన్ని ఆరోగ్యప్రయోజనలున్నాయో తెలుసా ….?

మన దేశంలో శతాబ్దాలకు మునుపే నీరును శుభ్రపరిచేందుకు రాగిప్రాతలు వాడేవారు. రాగి చెంబులతో నీరును త్రాగేవారు. మరి పురాతన కాలం నుంచి రాగి చెంబులు వాడటానికి కారణాలు లేకపోలేదు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. సూర్యకిరణాలు రాగిపాత్రలపై పడినపుడు సంభవించే రసాయన క్రియ కారణంగా అందులోని సూక్ష్మక్రిములు చనిపోతాయి. రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలకు దాదాపుగా దూరంగా ఉండొచ్చు. శరీరంలో కాపర్‌ నిల్వలు తగ్గిపోవడం వల్ల థైరాయిడ్‌ సమస్య వస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగితే నీటిలోని అయానికత వల్ల శరీరంలో కాపర్‌ నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా థైరాయిడ్‌ సమస్యలను నివారించవచ్చు.

1. పరగడుపున రాగి చెంబులో నీళ్లు తాగడం వలన పెద్ద పేగు శుభ్రపడి మనం తినే ఆహారంలోని పోషకాలను ఎక్కువ శాతం గ్రహిస్తుంది.
2. శరీరంలో కొత్త రక్తం తయారీకి కండరాలలో కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
3. రక్త కణాలను శుద్ధి చేయడం వలన శరీరంలో మలినాలు తగ్గుతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది.
4. శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ చర్యవల్ల శరీరంలో ద్రవపదార్ధాలను కోల్పోనీకుండా ఇన్‌ఫెక్షన్‌ను దరి చేరనీయదు.
5. అరగంట లోపు సుఖవిరేచనం అగుతుంది .
6. గ్యాస్ నిర్మూలించబడుతుంది.
7. కడుపు ఉబ్బరం , కడుపు మంట నివారించ బడుతుంది.
8. మలబద్దకం , తేపులు మొదలయిన బాదలన్ని ఈ అలవాటు తో పూర్తిగా నిర్మూలించబడును.

The post మీరు రాగి చెంబులో నీరు తాగితే, మీ శరీరానికి ఎన్ని ఆరోగ్యప్రయోజనలున్నాయో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2LL264R

No comments:

Post a Comment