etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, September 5, 2019

ప్రతి అబ్బాయి మొలతాడు కట్టుకోవాలి లేకుంటే ఏం జరుగుతుందో తెలుసా ..?

హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని వయసుల మగవారు నడుము భాగంలో ఈ మొలతాడు (మొలత్రాడు) ను ధరిస్తారు. మొలతాడును దారంతో తయారు చేస్తారు. కొందరు వెండి తోను, బంగారంతోను, ప్లాటినమ్ తోను ఈ మొలతాడును తయారు చేయించుకుని ధరిస్తారు. మొలతాడు మార్చవలసినప్పుడు కొత్త దానిని ధరించిన తరువాత పాతదానిని తొలగిస్తారు. మొలత్రాడు, పురుషుల నడుం చుట్టూ కట్టే ఒక దారం లేదా దారం రూపంలో ఉన్న అలంకార లోహం . ఇది హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. యావత్ భారతదేశంలో ఈ సాంప్రదాయం ఉంది. చిన్నతనంలో బాలబాలికలిరువురికీ కట్టిననూ, పెద్దవారైన తర్వాత స్త్రీలు మొలత్రాడు వాడరు. పురుషులు మాత్రం తప్పక వాడవలసిందే. పురుషుడి భార్య కాలం చేస్తే గానీ మొలత్రాడు తీయకూడదు అన్న (మూఢ) నమ్మకం ఇప్పటికీ ఉంది.

హిందూ సాంప్ర‌దాయంలో పాటించే పద్దతులలో ప్రతీది సైన్స్ కు సంబంధం ఉంటుంది. మనం దరించే ప్రతి వస్తువు మనకు ఆరోగ్యంతో పాటు వికాసాన్ని అందిస్తుంది. చివరకు మొల‌తాడు ధ‌రించ‌డం వెనుక కూడా ఒక అంతరంగం ఉంది అదేంటో మీరే చూడండి. మొల‌తాడు ధ‌రించ‌డం వెనుక హిందూ సాంప్ర‌దాయంలో ఒక భాగం ఎందుకంటే ఇది హిందువులలో ప్రతి మగాడికి ఉంటుంది. చిన్న పిల్ల‌ల‌కు మొల‌తాడు క‌డితే వారు ఎదుగుతున్న స‌మ‌యంలో ఎముక‌లు, కండ‌రాలు స‌రైన ప‌ద్ధ‌తిలో వృద్ధి చెందుతాయ‌ట‌. ప్ర‌ధానంగా మ‌గ పిల్ల‌ల్లో పెరుగుద‌ల స‌మ‌యంలో పురుషాంగం ఎటువంటి అస‌మ‌తుల్యానికి గురికాకుండా క‌చ్చిత‌మైన పెరుగుద‌ల ఉండేందుకు మొల‌తాడును క‌డ‌తార‌ట‌. మొల‌తాడు క‌ట్టుకుంటే ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. మ‌గ‌వారికి హెర్నియా రాకుండా మొల‌తాడు కాపాడుతుంద‌ట‌. దీన్ని ప‌లువురు సైంటిస్టులు కూడా నిరూపించార‌ట‌.మ‌న ద‌గ్గ‌ర చిన్న పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా వెండితో చేసిన మొల‌తాడును క‌ట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ఎలాంటి మొల‌తాడు క‌ట్టినా దాంతో మాత్రం ఉప‌యోగ‌మే ఉంటుంద‌న్న‌మాట‌.

The post ప్రతి అబ్బాయి మొలతాడు కట్టుకోవాలి లేకుంటే ఏం జరుగుతుందో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/34vOsv5

No comments:

Post a Comment