etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, September 5, 2019

వక్కపొడి తింటున్నారా …? ఈ విషయం తెలిస్తే జీవితంలో తినరు, అదేంటో తెలుసుకోండి.

వక్కపొడి వేసుకోవ్వడం నోట్లో ఎదో ఒక్కటి నమలడం వల్ల కడుపు నిండిన భవన్ కలుగుతుంది అని అస్తమానం తిండి పైన ధ్యాస పోకుండా వుంటుంది అనుకుంటాం కానీ ఇది కేవలం అపూహే అంటారు నిపుణులు. తమలపాకుల్లో వక్కపొడి వేసుకున్నా, వక్కపొడి తినే అలవాటుతో తిన్నా, మాములు వాక్క అయినా తిండి పైన ధ్యాస మళ్ళించడం లేదా వరువు తగ్గించడంలో పరోక్షంగా ఉపయోగ పాడుతుందనో అనుకోవడం లో అర్ధం లేదు. వక్కల్లో స్టిములెంట్ యాక్టివిటి వుంటుంది. చురుకుదనం, ఫాస్ట్ హార్ట్ రేట్, పల్పిరేషన్లు, హై బ్లడ్ ప్రేషర్, చమటలు, ఉంటాయి. శరీరం పై మనస్సు పై దాని ప్రభావం ఎంత వరకు అన్నది ఎవ్వరికీ స్పష్టత లేదు. బరువు తగ్గాలనుకొంటే నేరుగా వ్యయామాలు, ఆహార విధానాల్లోనే శ్రద్ధ తీసుకోవాలి తప్పా ఇలాంటి పరోక్ష పద్దతుల వల్ల ప్రయోజనం లేదనే అంటున్నారు. పైగా క్రమం తప్పకుండా వక్క పొడి తింటే శరీరానికి కీడే తప్ప ఉపయోగం లేదంటున్నారు.

అయితే మనం ఎక్కూవగా వక్కపొడిని భోజనం చేసిన తర్వాత తినటానికి ఇష్టపడుతాం. వక్కపొడిని పాన్ లేదా తమలపాకులో చుట్టుకొని ప్రతి రోజు వేలమంది తినటం మనం తరచు గమనిస్తూ ఉంటాం. ప్రతి దేశంలో పాన్ వివిధ రకాలుగా తయారు చేస్తున్నప్పటికీ వీటిలో సామాన్యంగా తమలపాకు, నిమ్మ, ఏలకులు, దాల్చిన చెక్క మరియు పొగాకులను వాడి తయారు చేస్తారు. పాన్ తయారీలో వక్కపొడి ముఖ్యపాత్ర పోషిస్తుంది. వక్కపొడి వల్ల వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశాలుఎక్కువగా ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది.

“ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్” వారు చేసిన పరిశోధనల్లో పాన్ లో కలిపే ఏలకులు మరియు దాల్చిన చెక్క మినహా ప్రతి పదార్థం క్యాన్సర్ కారకమవుతుందని తెలిపారు. మహమ్మారి క్యాన్సర్ ను కలుగచేసే పట్టికలో ‘వక్కపొడి’ మొదటి స్థానంలో ఉందట. “వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్” ప్రకారం, వక్కపొడి తినటం వలన క్యాన్సర్ కలిగే అవకాశం పుష్కలంగా ఉందని, ముఖ్యంగా నోటి మరియు అన్నవాహిక క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఉందని చాలా పరిశోధనలలో వెల్లడించబడింది. వక్కపొడి ఎక్కువగా నమిలే వారిలో ‘సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్’ అధికంగా ఉత్పత్తి చెందుతుంది. ఇలా సబ్ మ్యూకస్ అధికంగా ఉత్పత్తి చెందటం వలన దవడ కదలికలలో అవాంతరాలు ఏర్పడతాయి.అందువల్ల వక్కపొడి నమలడం అలవాటున్న వారు ఇకపైన అయిన ఆ అలవాటు నుంచి బయటపడితే తమ ఆరోగ్యానికి మంచిది.

The post వక్కపొడి తింటున్నారా …? ఈ విషయం తెలిస్తే జీవితంలో తినరు, అదేంటో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2UyIUv4

No comments:

Post a Comment