etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, September 4, 2019

మీరు కొనే మందులు అసలువా నకీలీవా …! ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఇలా …?

మందు లేదా ఔషధము అనగా వ్యాధిని నయం చేయడానికి గాని నిరోధించడానికి గాని ఇవ్వబడే పదార్థం. మందులు అనేకము. ఆయుర్వేదం మందులు, మూలికా మందులు, అల్లోపతి మందులు, హోమియోపతి మందులు, యునానీ మందులు, సిద్ధ మందులుగా అనేక రకాలు ఉన్నాయి. ఒక్కక్క వ్యాధికి ఒక్కొక్క విధానము బాగా పనిచేయును. నేటి సమాజములో అత్యవసర పరిస్థితులలో అల్లోపతి విధానము లోని మందులే ఎక్కువగా వాడుతున్నారు., జలుబు చేసిందనో, తలనొప్పి బాధిస్తుందనో మెడికల్‌ షాపుకు వెళ్లి మందుబిళ్ల తెచ్చుకొని ఠక్కున వేసేసుకుంటున్నారా? అయితే మీరు రోగాన్ని మరింత పెంచుకున్నట్టే. టీవీల్లో ప్రకటనలు చూసి అరకొర పరిజ్ఞానంతో డాక్టర్‌ సలహా పొందకుండా మందుబిళ్లలు తీసుకుంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే. ఎందుకంటే, మహానగరంలో మందులోళ్ల మాయలతో కల్తీ మందులు పుట్టుకొస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు మందులు తయారుచేసేస్తున్నాయి…. ఇంతకు ముందు ప్రజలు విరివిగా ఉపయోగించిన విక్స్‌ యాక్షన 500 ఎక్స్‌ట్రా, కోరెక్స్‌, క్రోసిన కోల్డ్‌, ఫ్లూ, డి-కోల్డ్‌ టోటల్‌, డోలో కోల్డ్‌ వంటి మందులు నిషేధానికి గురయ్యాయి. హానికరంగా పరిణమిస్తున్న ఎఫ్‌డీసీ మందుల తయారీ, విక్రయాలను నిలిపివేసే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొంది. అయితే మీరు కొన్న మందులు అసలువా నకీలీవా అన్న విషయం మీకు ఎలా తెలుస్తుందీ? మీకు మీరుగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి??

మీరు కొనుగోలు చేసే ప్రతీ డ్రగ్ ప్యాకెట్ మీదా 9అంకెల యూనిక్ ఐడీ నంబర్ ఉంటుంది. మీరుకొన్న ట్యాబ్లెట్ స్ట్రిప్ మీదా,టానిక్ బాటిల్ మీదా ఏ రకమైన ఔషద ప్యాకింగ్ అయినా సరే ఈ నంబర్ ఖచ్చితంగా ఉంటుంది.ఆ 9 అంకెల నంబర్ ని మీ మొబైల్ లో టైప్ చేసి 9901099010 అనే నంబర్ కి మెసేజ్ చేయండి. కొద్దిసేపట్లోనే మీకు మరో మెసేజ్ వస్తుంది. ఆ రిప్లై మెసేజ్ లో ఆ డ్రగ్ తయారయిన ఫార్మా కంపెనీ పేరూ, అది తయారయిన బ్యాచ్ నంబరూ ఉంటాయి. అవి మీ దగ్గరున్న మందులతో సరిపోలితే అది నకిలీ కాదు. ఒక వేళ ఆ మెసేజ్ లో వచ్చిన వివరాలలో ఏ ఒక్కటి తేడాగా ఉన్నా మీరు నకిలీ మందుని కొన్నారని అర్థం. అలా వారు పంపిన వివరాలతో గనక సరిపోలనట్టైతే తిరిగి అదే మెసేజ్ ని రిప్లైగా పంపినట్టయితే. ఆ విషయం కంప్లైంట్ గా నమోదవుతుంది.

The post మీరు కొనే మందులు అసలువా నకీలీవా …! ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఇలా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2zMH4Np

No comments:

Post a Comment