etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, November 15, 2019

మునగాకును ఇలా చేసి తింటే ఏకంగా 300 వ్యాదులు మాయం.

మునగ ఆకు గురించి ఈ తరం వారిలో చాలామందికి తెలియకపోవటం ఆశ్చర్యకరమే. గృహవైద్యంలో ములగ ఆకు ఎంత ప్రధానమైనదో మన బామ్మలకు, అమ్మమ్మలకు, గ్రామీణ ప్రజానీకానికి బాగా తెలుసు. పిండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే సర్వరోగ నివారిణి ‘మునగాకు”. దీన్ని మెత్తగా నూరి, మరుగుతున్న నీటిలో వేసి, మూతపెట్టి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. కాస్తంత చల్లారిన తరువాత వడగట్టి ఉప్పు, మిరియాల పొడి చేర్చి సూప్‌లాగా తీసుకోవచ్చు. మునగాకు రసం, తేనె, కొబ్బరినీరు కలిపి చిన్న కప్పు చొప్పున ప్రతిరోజూ రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు, కాలేయ సమస్యలు తగ్గుతాయి.

1. పాల‌క‌న్నా 17 రెట్లు ఎక్కువ కాల్షియం మ‌న‌కు మున‌గాకు ద్వారా ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్ల‌ల‌కు మంచిది. దంతాలు దృఢంగా త‌యార‌వుతాయి.
2. మున‌గాకులో ప్రోటీన్లు కూడా ఎక్కువే ఉంటాయి. మాంసం తిన‌నివారు మున‌గ ఆకుల‌తో కూర చేసుకుని తింటే దాంతో శ‌రీరానికి ప్రోటీన్లు బాగా ల‌భిస్తాయి. శ‌రీరానికి పోష‌ణ స‌రిగ్గా అందుతుంది.
3. అర‌టిపండ్ల క‌న్నా 15 రెట్లు అధికంగా పొటాషియం మ‌న‌కు మున‌గాకు ద్వారా అందుతుంది. దీంతో గుండె స‌మ‌స్య‌లు పోగొట్టుకోవ‌చ్చు. ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగుప‌డుతుంది.
4. రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్‌ గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ద్వారా బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచవచ్చు. దీంతో మ‌ధుమేహం ఉన్న వారికి మున‌గాకు చ‌క్క‌ని ఔష‌ధం అని చెప్ప‌వ‌చ్చు.
5. ఐదు రకాల క్యాన్సర్లకు మునగాకు మంచి మందుగా పనిచేస్తుంది. లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా వీటికి ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. యాంటీ ట్యూమర్‌గానూ మునగాకు పనిచేస్తుంది.
6. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే సహజమైన మందు నాచురల్‌ మెడిసిన్‌ మునగాకు. మునగాకులో ఎ, సి విటమిన్లు, క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ కూడా అధికంగా ఉన్నాయి.
7. మునగాకు రసాన్ని రోజూ తాగితే దృష్టి మాంద్యం, రేచీకటి తగ్గుతాయి. మునగాకులలో అమినో ఆమ్లాలు ఉండడంవల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.
8. గర్భీణులకు, బాలింతలకు మునగాకు రసం ఎంతో మంచిది. వారికి అవసరం అయిన క్యాల్షియం, ఐరన్‌, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
9. మునగాకు రసం రక్తహీనతను నివారిస్తుంది. మునగాకుల రసాన్ని పాలల్లో క‌లిపి పిల్లలకు అందిస్తే ఎముకలు బలంగా తయారవుతాయి.

The post మునగాకును ఇలా చేసి తింటే ఏకంగా 300 వ్యాదులు మాయం. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/32R9qT1

No comments:

Post a Comment