etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, November 12, 2019

పాలకూర గురించి ఈ విషయాలు తెలిస్తే, మీరు రోజు పాలకూరే తింటారు.

మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. ఆకు కూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కలనుండి వచ్చినా వీటి పోషక విలువలలో మరియు వండే విధానములో మాత్రము ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రాధాన్యతను ఇస్తారు. ఈ క్రమంలోనే నిత్యం తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. అయితే అలాంటి పోషకాలు దండిగా ఉన్న ఆహారాల్లో ‘పాలకూర’ కూడా ఒకటి. మరి దీన్ని తరచూ మన ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాలకూరలోని ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయి. 13 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ పాలకూరలో ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి.
2. విటమిన్ కె, విటమిన్ సి, ఎ, మెగ్నిషియం, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, సోడియం, క్లోరిన్, పాస్ఫరస్, ఐరన్, ప్రోటీన్లు, బీటాకెరోటిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు తదితర పోషకాలు ఇందులో సమృద్ధిగా దొరుకుతాయి.
3. పలు రకాల క్యాన్సర్‌లు రాకుండా అడ్డుకుంటుంది. గుండె జబ్బులను నిరోధిస్తుంది. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తినే మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
4. నిత్యం మన శరీరానికి అవసరమైన ఐరన్ పాలకూర ద్వారా లభిస్తుంది. రక్తహీనతను తగ్గించడంతోపాటు రక్తాన్ని శుద్ధి చేసే గుణం, రోగ నిరోధక శక్తిని పెంచే గుణం పాలకూరలో ఉంది.
5. శరీర పెరుగుదలకు, దృఢత్వానికి పాలకూర ఉపయోగపడుతుంది.

The post పాలకూర గురించి ఈ విషయాలు తెలిస్తే, మీరు రోజు పాలకూరే తింటారు. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2qPD9y8

No comments:

Post a Comment