బీటు దుంప పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన ఒక రకమైన మొక్క. ఇది చెనోపోడియేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం బీటా వల్గారిస్. వీనిని వేరు రూపాంతరంగా పెరిగే దుంపల కోసం పెంచుతారు. ఈ బీటుదుంపలను కూరగాయగా, చక్కెర తయారీ కోసం మరియు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. బీటు మొక్కలలో మూడు ఉపజాతులను గుర్తించారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే బీట్‌రూట్ రసాన్ని తాగండి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. కాబట్టి రోజూ 250 మి.గ్రా. పచ్చి బీట్‌రూట్ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది. బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.
1 . డయాబెటిక్ లివర్ ను కాపాడును ,
2 . కొలెస్టిరాల్ ను తగ్గించును ,
3 . మలబద్దకం ను నివారించును ,
4 . బీట్ రూటు రసము రక్తపోటును తగ్గించు .
5 . బోరాన్ ఎక్కువగా ఉన్నందున “aphrodisiac “గా సెక్స్ హోర్మోన్స్ ఎక్కువచేయును .
6 . కొంతవరకు కాన్సర్ నివారణ కు ఉపయోగ పడును .
The post బీట్ రూట్ ఇలా తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా ..? తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2q9ROnR
No comments:
Post a Comment