బెండ మొక్క సామాన్యముగా 1 నుండి రెండు మీటర్లు ఎత్తు పెరుగును. అనుకూల పరిస్థితులలో నాలుగు మీటర్లల వరకూ పెరుగును. మొక్క యందలి లేత భాగములందు బిరుసుగా ఉండు నూగు ఉండును. పై అంచులయందు తాళ పత్ర వైఖరి చీలి సంయుక్తమౌగా ఉండును. అండాశయము ఐదు అరలు కలిగి ఉండును. కీలము కొన ఐదుగా చీలి నిడివిగ ఉండును. కాయము ఐదు గదులు కలిగి ఉండును. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వరుస గింజలు ఉండును. ఎండిన వెనుక కాయ పై నుండి క్రిందికి క్రమముగా ఐదు భాగములుగ పగులు ఉండును. గింజలు చిన్న కందిగింజలంతేసి యుండును. గ్రామునకు 12 15 తూగును. నీల వర్ణముతో కూడిన ధూమ్రవర్ణము కలిగి బొడ్డు వద్ద మాత్రము తెల్లగ ఉండును. అయితే ప్రస్తుత రోజుల్లో బెండకాయ తింటే లాభాలెంటో తెలుసా.. ఈ లాభాలు తెలియకనే చాలా మంది బెండకాయలను కూరగా కానీ ఫ్రై గా కానీ తినడానికి ఇష్టపడరు.
అయితే వీటి లాభాలు ఏమిటో తెలిస్తే వారంలో మూడు రోజులు బెండకాయ సంబంధిత కూరలే తింటారనడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అయితే బెండకాయ తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాం.బెండకాయల్లో ప్రోటీన్,ఫైబర్ ,క్యాల్షియం,ఐరన్ ,జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.బెండకాయ తినడం వలన వీటివలన శరీరానికి పోషక విలువలు అందుతాయి.బెండకాయలను తినడం వలన క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివలన షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. బెండకాయల్లో ఉండే విటమిన్ K ఎముకలను దృఢంగా చేస్తుంది.
The post బెండకాయ ఇలా తింటే, ఎన్ని ఉపయోగాలో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2QBKrRc
No comments:
Post a Comment