పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ. దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు, పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి. మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది. ఆవు మజ్జిగ మూడు దోషాలను తగ్గిస్తుంది. పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది. గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది. అలాగే వాపును పెంచుతుంది. కాబట్టి పరిమితంగా వాడాలి. మేక మజ్జిగ తేలికగా ఉంటుంది. మూడు దోషాల మీద పనిచేస్తుంది. మజ్జిగను వాడకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి.
1. మజ్జీగలో అర స్పూన్ అల్లం రసం కలుపుకుని త్రాగితే విరోచనాలు తగ్గుతాయి
2. ప్రతీరోజు ఉదయం ఉప్పు లేకుండా త్రాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది
3. మజ్జీగ త్రాగడం వలన జీర్ణాశయం పేగులో ఉండే హానికర బ్యాక్టీరియా నశిస్తుంది
4. మలబద్ధకం ,అజీర్తి గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి
The post మీరు రోజు మజ్జిగ త్రాగుతున్నారా ..? వాటి వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2OgGu2N
No comments:
Post a Comment