etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, November 27, 2019

బిర్యానీ ఆకు వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా ..?

బిర్యానీ తయారీలో మసాలా దినుసులతో పాటు.. బిర్యానీ ఆకును కూడా వినియోగిస్తుంటారు. అయితే, ఈ బిర్యానీ ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా మధుమేహం నియంత్రణలో ఉండానికి బిరియానీ ఆకు బాగా ఉపయోగపడుతుంది. అయితే స్పెషల్‌ బిర్యానీ అయినా, పులావ్‌ అయినా ఘుమఘుమలాడించే సువాసనతో భోజన ప్రియులను కట్టిపడేస్తూ పసందైన రుచిని అందించేది బిర్యానీ ఆకు. మసాలా వంటకాల్లో మసాలా దినుసు లతో పాటు బిర్యానీ ఆకు వాడటం అందరికీ అలవాటు. అయితే దీని అవసరం ఒక్క రుచికే పరిమితం కాదు. మంచి ఆరోగ్యాన్నీ అందిస్తుందని తాజా అధ్యయనాలు తేల్చాయి.

కాబట్టి తరచుగా బిర్యానీ ఆకును వంటకాల్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు వైద్యసలహాదారులు. నరాల పనితీరుకి బిర్యానీ ఆకులో విటమిన్‌ బి, పాంటోథెనిక్‌ ఆమ్లం, ఫైరాడిక్సిన్‌, రైబో ఫ్లేవిన్‌ అధికంగా లభిస్తాయి. శరీరంలోని ఎంజైముల పనితీరుని ఇవి మెరుగుపరుస్తాయి. నాడీవ్యవస్థ పనితీరు, జీవక్రియలను మెరుగుపరచడంలో బిర్యానీ ఆకు సహాయపడుతుంది. బిర్యానీ ఆకులో ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల బిర్యానీ ఆకుల్లో 180 గ్రాముల ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి ఇది గర్భిణీలకు చాలా అవసరం.

ప్రెగెన్సీ సమయంలో, ప్రసవానంతరం కడుపులో బిడ్డకి, ఫోలిక్‌యాసిడ్‌ చాలా అవసరం. కంటిచూపుకి అవసరమైన విటమిన్‌ ఎ బిర్యానీ ఆకుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది మెరుగైన కంటిచూపుకి సహాయపడుతుంది. కాబట్టి విటమిన్‌ ఎ లోపంతో బాధపడేవాళ్లు బిర్యానీ ఆకులను ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి కంటిచూపు సమస్యలూ ఉండవు. అలాగే బిర్యానీ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి సహకరిస్తాయి. ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌తోనూ ఇది సమర్థవంతంగా పోరాడుతుంది.

The post బిర్యానీ ఆకు వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2snUnDT

No comments:

Post a Comment