సోంపు ఒక రకమైన మసాలా దినుసు. ఇది చూడడానికి జీలకర్ర వలె ఉన్నది. ఇది చాలా మంచి ఔషధము. చిన్న పిల్లలలో వచ్చే అనేక రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొడిచేసి తినిపించినా లేదా పొడిచేసి నీళ్ళలో ఒక గంట ఇచ్చి ఆ నీళ్ళు ఇచ్చినాఅ కడుపునొప్పి, గాస్ట్రిక్ ట్రబుల్ తగిపోతాయి. విచేచనం సాఫీగా అవుతుంది. నులి పురుగులు పడిపోతాయి. కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులలో ఇది శ్వాసనాళాలను తెరిపించి గాలి ఆడేటట్లు చేస్తుంది. మూత్రంలో వచ్చే మంట తగ్గడానికి సోంపు ఉపయోగపడుతుంది.
1. సోంపు యాంటీ ఆక్సిడెంట్ ను అధికంగా కలిగి ఉంది .అదువల్ల శరీరంలో ఏర్పడ్డ కొవ్వును తగ్గించి అధిక బరువు సమస్యను దూరం చేస్తుంది.
2. సొంపులో ఉండే పోషక విలువలు మీ శరీరపు చర్మ సౌదర్యాన్ని పెంచుతాయి. శరీరపు కాంతిని పెంచడంతో పాటు..చర్మంపై ఏర్పడే ముడతలను తగ్గిస్తుంది.ఇది ముఖానికి రక్తప్రసరణ భాగా జరిగేల చేస్తుంది.
3. సోంపు మనం తిన్న ఆహారం సక్రమంగా అరిగేందుకు సహాయపడుతుంది.మన కడుపులో ఏర్పడే గ్యాస్ట్రిక్ సమస్యకు సోంపు ఒక చక్కని ఔషధం గా చెప్పవచ్చు. అంతేకాక ఆకలి లేకపోవడాన్ని తగ్గించి..ఆకలి పుట్టేలా చేస్తుంది.
4. సోంపు శరీరంలో హానికరమైన టాక్సీ న్లు పెరిపోకుండా చేస్తుంది.శరీరంలో జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్ధాలను బయటికి పంపడంలో సహయాపడుతుంది.అంతేకాక మహిళల్లో పీరియడ్స్ సమయంలో ఏర్పడే ఇబ్బందులను తొలగిస్తుంది.
5. భోజన చేసిన తరువాత వచ్చే కడుపు నొప్పులను ,భోజనం చేయకపోవడం వలన వచ్చే నొప్పులను లేదా కడుపు ఖాళీగా ఉండటం వల్ల వచ్చే కడుపు నొప్పులను చాలా వరకు తగ్గిస్తుంది..ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని దూరం చేస్తుంది.
6. గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.మనం తిన్న ఆహారం తేలికగా అరిగేలా చేయడమే కాకుండా తిన్న ఆహారం శరీరానికి పట్టేలా చెయ్యడం సోంపు యొక్క ప్రత్యేకత.
7. సొంపును ఒక అద్బుతమైన మౌత్ ఫ్రేషనర్గ చెప్పవచ్చు.నోటి దుర్వాసనతో భాధపడే వారు సొంపును నమలడం ద్వారా నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు.
8. సోంపును వేడి నీటిలో వేసి..ఆ నీటితో నోటిని పుక్కిలించడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు.
9. సోంపు కంటి చూపును మెరుగు పరుస్తుంది.సాధారణంగా వచ్చే జలుబు మరియు దగ్గును నివారిస్తుంది.
The post సోంపు వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా ..? తెలిస్తే షాక్ అవుతారు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Oq1KmL
No comments:
Post a Comment