అమ్మాయిలు బొద్దుగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆరోగ్య కారణాలు, వంశపారంపర్యం, వ్యాయామలేమి.. ఇలా ఎన్నో.. అలాగని బొద్దుగా ఉన్నవారు ఫ్యాషన్ జోలికి వెళ్లకూడదా? రకరకాల ఫ్యాషన్లు అనుసరించడానికి వీలులేదా? బొద్దుగా ఉంటే అన్ని డిజైన్లు నప్పవు.. ఇలాంటివన్నీ పాత మాటలు. ఇప్పుడు బొద్దుగా ఉన్నవారికి కూడా రకరకాల ఫ్యాషన్లలో దుస్తులు లభిస్తున్నాయి. ఆన్‌లైన్లలో కూడా నచ్చిన డిజైన్‌ను డబుల్ ఎక్సెల్‌లో కూడా చేసి ఇస్తున్నారు , అయితే అమెరికా, చైనా తర్వాత స్థూలకాయులు అత్యధికంగా ఉన్నది భారతదేశంలోనే. ఈ నిజం ‘గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్’ వాళ్ల సర్వేలో వెళ్లడయ్యింది. ఇదే సర్వేలో బాలబాలికల్లో కూడా స్థూలకాయుల సంఖ్య బాగా పెరిగిపోతోందనే మరో విషయం కూడా బయటపడింది. పలు ప్రమాదకర వ్యాధులకు దారి తీసే ఈ సమస్య మహమ్మారిలా వ్యాపిస్తోంది.
ముఖ్యంగా, మన దేశ నగరాల్లో ఉన్న స్కూలు పిల్లల్లో ఈ సమస్య దాదాపు 4.5 శాతం మందిలో కనిపిస్తోంది. బాలురతో పోలిస్తే, బాలికల్లోనే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. పిల్లలు బరువు పెరుగుతూ ఉంటే, బొద్దుగా ఉన్నారంటూ తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. నిజానికి చాలా మంది తల్లిదండ్రులు అధిక బరువుకూ, స్థూలకాయానికీ మధ్య నున్న తేడాను గుర్తించలేకపోతున్నారు. ఈ తరం పిల్లలకు శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. దీనికి తోడు స్వీట్లు, ఐస్‌క్రీమ్‌ల వంటి ఎక్కువ కేలరీలు ఉండే ఆహార పదార్థాలు ఇవ్వడం కూడా ఇందుకొక ప్రధాన కారణంగా ఉంటోంది. అయితే, గర్భంలో ఉన్నప్పుడు తల్లికి సరైన పోషకాలు అందకపోయినా ఆ పుట్టిన పిల్లలకు స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉంది. వైరుధ్యంగా కనిపించవచ్చు గానీ, ఇది వాస్తవం. దీనికి తోడు బాగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు పెట్టడం ద్వారా వాటిలోని పోషకాలు పోయి, అందులోని గ్లూకోజ్ మాత్రమే ఉండిపోతుంది.
విటమిన్లు, లవణాలు తక్కువగానూ, ఎక్కువ కేలరీలు ఉండే ఈ పదార్థాలు అతిగా ఇవ్వడం కూడా వారి బరువు పెరగడానికి కారణమవుతున్నాయి. పోషకాలు త గ్గిపోవడం లేదా పెరిగిపోవడం ఈ రెండు రకాల సమస్యలు నేడు పిల్లల్ని దేశీయంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సతమతమతం చేస్తున్నాయి. అంతిమంగా ఇవి చిన్న వయసులోనే అధిక రక్తపోటుకు, మధుమేహానికి, గుండె జబ్బులకు దారి తీస్తున్నాయి. వీటితో పాటు ఎముకలు, కీళ్ల సమస్యలకు దారి తీస్తున్నాయి. కొంతమంది పిల్లల్లో ఈ సమస్య నిద్రలేమికి కారణమవుతోంది.
The post మీరు బొద్దుగా ఉన్నారా..! అయితే ఈ జాగర్తలు తప్పనిసరి, ఎందుకంటే ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2qYSE7w
No comments:
Post a Comment