etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, November 24, 2019

గ‌ర్భిణీలు మీరు ఇలా అస్సలు చేయకండి, ఎందుకంటే ..?

ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా తీసుకోవాలి . మొదటి ఆరునెలలు …. నెలకొకసారి, ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము . సొంతముగా మందులు వాడడము, ఎక్షురేలు తీయించుకోవడము చేయకండి . ఎత్తుమడమల చెప్పులు వాడకంది, గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. మొదటి మూడునెలలు, చివరి నెలలో దూరప్రయాణాలు, కారు స్కూటరు నడపడము, చేయరాదు . రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు తిరిగి పడుకోవాలి.

స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును. ధనుర్వాతం బారినుండి రక్షణకోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌లు తీసుకోవాలి . రక్తస్రావము, ఉమ్మనీరు పోవడము, శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు, కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి. అయితే మహిళలు గ‌ర్భంతో ఉన్న ఆ స‌మ‌యంలో ఎన్నో తగిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. తినే ఆహారం, మందుల విష‌యంలో క‌చ్చితంగా వైద్యుల స‌ల‌హా తీసుకోవాలి. ఇంకా ఏమీ తీసుకోవాలి..ఏం చెయ్యకూడదు అనేది తెలుసుకుందాం. గ‌ర్భిణీలు ఏ మాత్రం తేడా వ‌చ్చినా క‌డుపులో ఉండే బిడ్డ‌కే కాదు, త‌ల్లికి కూడా ప్రాణాంత‌క ప‌రిస్థితులు వ‌స్తాయి.

గ‌ర్భిణీలు.. లిప్‌స్టిక్‌, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఇతర కాస్మోటిక్స్ ఎక్కువ‌గా వాడ‌రాదు, కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొంద‌రు ప‌రిశోధ‌కులు గ‌ర్భంతో ఉన్న మేక‌ప్ వేసుకునే స్త్రీల‌ను ప‌రీక్షించారు. తేలిందేమిటంటే.. గ‌ర్భం దాల్చిన స్త్రీలు మేక‌ప్ వేసుకోవ‌డం వ‌ల్ల వారి క‌డుపులో ఉండే బిడ్డ‌పై ఆ మేక‌ప్ సామ‌గ్రిలో ఉండే కెమిక‌ల్స్ ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌. దీని వ‌ల్ల పుట్ట‌బోయే బిడ్డ‌ల‌లో చురుకుద‌నం లేక‌పోవ‌డం, మాన‌సిక ఆరోగ్యం సరిగ్గా ఉండ‌క‌పోవ‌డం.. వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

The post గ‌ర్భిణీలు మీరు ఇలా అస్సలు చేయకండి, ఎందుకంటే ..? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/35xa21E

No comments:

Post a Comment