etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, March 29, 2019

పెరుగు బదులు మజ్జిగ తీసుకుంటే 100 రెట్లు ఆరోగ్యం… కొవ్వు పెరగకుండా ఉండటానికే మన పూర్వికులు మజ్జిగను వాడేవారు

ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారం లో మజ్జిగ ను పూర్తిగా మానేశారు. రోజూ రెండు పూటలా పెరుగు ను మాత్రమే వాడుతున్నారు. పెరుగు ను చిలికి వెన్న తీసి మజ్జిగ ను తయారు చేయడానికి కొంత సమయం వెచ్చించాలి. కాబట్టి ఆ విధంగా సమయం వృధా చేయకుండా అన్నము లో పెరుగు ను కలుపుకొని తినడమే గొప్ప నాగరికత అని ఈనాడు అంతా మురిసి పోతున్నారు. అయితే పెరుగు ఆయుక్షిణం. ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు వాడకూడదు. అలా వాడితే ఉదరంలో వాయువు ఎక్కువ అయ్యి అనేక వాత రోగాలు వస్తాయని ఆయుర్వేద మహర్షులు మనకు నిక్కచ్చిగా తేల్చి ఏనాడో చెప్పారు. అయినా రోజూ రోజుకు కష్టపడి పని చేసే స్వభావం కోల్పోతు బద్ధకస్తులుగా మారుతున్న మనకు మజ్జిగ ను తయారు చేసి వాడడం కన్నా పెరుగు ను వాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నాము.

అసలు అన్నింటిలోకి మజ్జిగ చాలా ఉత్తమమైనదని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఊబకాయంతో బాధపడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఊబకాయ సమస్య నుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్‌ బి12, పొటాషియం, ఫాస్పరస్‌, కాల్షియం ఉంటాయి. ఊబకాయ నివారణకు ఇవి ఎంతో సహకరిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. ప్రతిరోజూ మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు దోహదడపుతుంది. మజ్జిగ శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. వివిధ జబ్బులను రానీయకుండా మజ్జిగ శరీరాన్ని కాపాడుతుంది. ఇది ఆరోగ్యకరమైన పానియం కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ మజ్జిగను తీసుకునేందుకు ప్రయత్నించండి.

The post పెరుగు బదులు మజ్జిగ తీసుకుంటే 100 రెట్లు ఆరోగ్యం… కొవ్వు పెరగకుండా ఉండటానికే మన పూర్వికులు మజ్జిగను వాడేవారు appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2OA8Pj1

No comments:

Post a Comment