etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, March 29, 2019

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తొలిసారి జగన్ సంచలన కామెంట్స్

ఈ ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తెస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ హామీ ఇచ్చారు.పుత్తూరులోని కార్వేటినగరం రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు పాలనలో సహకార రంగం పూర్తిగా కుదేలైపోయిందని విమర్శించారు. షుగర్‌ ప్యాక్టరీలు మూతబడ్డాయని,మామిడి జ్యూస్‌ ఫ్యాక్టరీలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయకుండా తమ పార్టీ వాళ్ళకు లాభం కలిగేలా చూస్తున్నారని ఆరోపించారు.నగరి, పుత్తూరు ప్రాంతాలకు సాగు, తాగునీరు కోసం గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.అంతకుముందు రోజా ప్రసంగిస్తూ నగరి నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించారు.

వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలం, నారాయణస్వామి, చక్రపాణిరెడ్డి,సునీల్‌కుమార్‌, ఏలుమలై, మహీన్‌ తదితరులు పాల్గొన్నారు.మార్క్‌ఫెడ్‌ మాజీ అధ్యక్షుడు నల్లారి తిమ్మారెడ్డి,ఆయన కుమారుడు శ్రీకర్‌రెడ్డి, పుత్తూరు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కార్తికేయన్‌, అన్నా లోకనాథం, వన్నెకుల సంఘ అధ్యక్షుడు అన్బురెడ్డి, పళణి, బాబురెడ్డి తదితరులు జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ బాబు జీవిత చరిత్రే

ఎన్నికల ముందు చంద్రబాబు చేసే డ్రామాలను న మ్మితే నరమాంసాన్ని తినే అందమైన రాక్షసిని నమ్మినట్టేన్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా బాబు జీవిత చరిత్రే అన్నారు. ఆ సినిమాను చూడడం ఆయనకు ఇష్టం లేదని, అందుకే సినిమా విడుదలను అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు. అందుకే ఢిల్లీ నుంచి నాయకులను రప్పించుకొని ప్రచారం చేస్తున్నాడన్నారు. ‘చంద్రబాబుకు ఓటేస్తే.. ఏ సినిమా చూడాలో.. ఏ పత్రిక చదవాలో.. ఏ చానెల్ చూడాలో కూడా జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తాయి.. ఆయన సినిమా మహానాయకుడంట.. ఆ సినిమా మాత్రమే చూడాలంట.. ఆయనకు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీస్తే చూడకూడదంట.. అది ఆయనకు వ్యతిరేకమేమీ కాదు.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర అది.. పొరపాటున చంద్రబాబుకు గెలిస్తే.. వాళ్ల ఆసుపత్రికే వెళ్లాలి.. వాళ్ల స్కూళ్లకే వెళ్లాలి.. వాళ్లు ఎంత ఫీజు చెబితే.. అంతా చెల్లించి బయటకు రావాలి….’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

The post లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తొలిసారి జగన్ సంచలన కామెంట్స్ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2CF35Qj

No comments:

Post a Comment