చేప ధర మహా అయితే కిలో రూ. 200 ఉంటుంది.. మరీ ఎక్కువ అనుకుంటే రూ.500.. అబ్బో అంటే రూ.1000 ఉంటుందేమో.. కానీ ఎర్రని మచ్చలతో ఉన్న ఈ చేప ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఎందుకంటే ఈ చేప ఖరీదు రూ.13 కోట్లు.. అవును మీరు నమ్మలేక పోయినా.. ఇది నిజం. దీని వెల అక్షరాలా రూ. 13 కోట్ల 54 లక్షల 4 వేల 3 వందల 40. మరీ ఈ చేప అంత ఖరీదు ఎందుకు ఉందో తెలుసా.. ఇది కొహాకు రకానికి చెందినది. ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన రకాల్లో కొహా కూడా ఒకటి. ఈ రకం చేపలు 5 లక్షల వరకు గుడ్లు పెట్టగలవు. అయితే వీటిలో 5 వేల వరకే నాణ్యమైనవి ఉంటాయి.అందుకే దీనిని అంత ఖరీదు పెట్టి వేలంపాటలో దక్కించుకుంది తైవానుకు చెందిన మహిళ. యింగ్ యింగ్ అనే ఈ మహిళకు అరుదైన జాతులకు చెందిన, భిన్నంగా ఉండే చేపలను సేకరించడం హాబి.
జపాన్‌లోని హిరోషిమ నగరంలో ఈ చేపకు వేలంపాట నిర్వహిస్తున్నారని తెలుసుకున్న యింగ్ యింగ్ అక్కడికి చేరుకుని ఖర్చుకు వెనుకాడకుండా 3 అడుగుల 3 అంగుళాలు ఉన్న ఈ చేపను తన సొంతం చేసుకుంది. అంత ధర పెట్టి కొనడానికి ఇంతకీ ఏముంది అందులో.. పిచ్చి కాకపోతే.. అని చెవులు కొరుకుంటున్న వారు లేకపోలేదు. అయినా పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి.. అని ఉరికే అనలేదు పెద్దలు.. ఇందుకేనేమో అంటూ ఈ మహిళ చేసిన పని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
The post రూ.13 కోట్లు పెట్టి చేపను కొన్న మహిళ.. ఇంతకీ ఏముంది అందులో….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Fsavbn
No comments:
Post a Comment