ఆటో డ్రైవర్ ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 వందల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. కరాచీ పట్టణానికి చెందిన ముహమ్మద్ రషీద్ ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల రషీద్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దాంతో వెంటనే రషీద్‌ను అదుపులోకి తీసుకుని ఇంతమొత్తంలో నగదు లావాదేవీలు ఎలా జరిగాయన్న దానిపై ఆరాతీశారు. దానికి రషీద్ తన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదని సమాధానం చెప్పాడు. ఇంటి అద్దె కట్టలేని రషీద్.. తన అకౌంట్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో లావాదేలు జరగడంతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అయితే ఈ బ్యాంకు ఖాతాని 2005లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేటప్పుడు ఆ కంపెనీ వారు ఓపెన్ చేశారని.. తన జీతం డబ్బులు అందులో వేసేవారని.
కొద్ది నెలల తర్వాత తాను ఆ ఉద్యోగం మానేసి ఆటో తోలుకుంటున్నాని అన్నాడు. తన జీవితంలో ఇంత వరకు లక్ష రూపాయలు కూడా చూడలేదు.. అలాంటిది మూడువందల కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉందనడం నా ఊహకు కూడా అందని విషయం. అంటూ నిరాశగా వెల్లడించాడు రషీద్. కాగా ఆ డబ్బు ఎవరి అకౌంట్ లోనుంచి ఎవరికీ చేరిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
The post ఊహకందని ఆశ్చర్యం.. ఆటో డ్రైవర్ అకౌంట్లోకి రూ. 300 కోట్లు..చివరికి ఏమైందో తెలుసా ..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2CwQ7UD
No comments:
Post a Comment