etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, March 20, 2019

భళారా.. బాలుడా! 9 ఏళ్ల బాలుడు పట్టువదలని విక్రమార్కుడిలా విజయం సాధించాడు, వైరల్ వీడియో

ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆటంకం ఎదురైతే నిరాశ చెందుతాం. ఆ నిరాశలో మనం చేయాల్సిన పనిని విరమించుకుంటాం. కానీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో.. ఆటంకం ఎదురైనా వెనకడుగు వేయవద్దని, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని అప్పుడే అనుకున్న పని పూర్తవుతుందని బోధిస్తోంది. బెంగళూరు చిక్కోడి తాలుకా కేరూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే.. గుర్రాల రేస్‌లో పాల్గొన్న ఓ 9 ఏళ్ల బాలుడు పట్టువదలని విక్రమార్కుడిలా విజయం సాధించాడు. ఆ కుర్రాడి విజయానికి ఆ అశ్వం కూడా సహకరించింది. అయితే ఈ రేస్‌ జరుగుతుండగా.. తన అశ్వాన్ని వేగంగా పరుగెత్తించిన ఆ బాలుడు.. మధ్యలో గుర్రంతో సహా కిందపడ్డాడు. ఆ బాలుడు కిందపడ్డా ఆ అశ్వం రేస్‌లో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పరుగెత్తింది. ఇక ఆ బాలుడు కూడా బైక్‌ సాయంతో సినిమాటిక్‌ తరహాలో అశ్వాన్ని అందుకోని రేస్‌లో విజయం సాధించాడు. ఈ వీడియోకు ముగ్ధులైన నెటిజన్లు భళారా.. బాలుడా.. ఓ స్పూర్తివంతమైన వీడియో అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

The post భళారా.. బాలుడా! 9 ఏళ్ల బాలుడు పట్టువదలని విక్రమార్కుడిలా విజయం సాధించాడు, వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2TXj7i7

No comments:

Post a Comment