ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ క్యాష్-రిచ్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సీజన్ ట్రోఫీని దక్కించుకొనేందుకు ఎనిమిది ఫ్రాంచైజీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాయి. గత 11 సీజన్లుగా ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది ఎలాగైనా ట్రోఫీని ముద్దాడేందుకు కఠోరంగా శ్రమపడుతోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో బెంగళూరులో ఆర్‌సీబీ జట్టు సభ్యులు ప్రాక్టీస్ చేస్తున్నారు.
అయితే ఆర్‌సీబీ ట్రైనింగ్ క్యాంప్‌లోకి మంగళవారం అనుకోని అతిథి ఒకరు వచ్చారు. ఆయన మరెవరో కాదు.. ఇండియా ఫుట్‌బాల్ దిగ్గజం, టీం ఇండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ. ఈ ఏడాది జరిగిన ఇండియా సూపర్ లీగ్‌లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ సునీల్ ఛెత్రీ సారథ్యంలో ఛాంపియన్‌గా నిలిచింది. కాగా ఆర్‌సీబీ ట్రైనింగ్ క్యాంప్‌కి వచ్చి ఛెత్రీని విరాట్ తన జట్టు సభ్యులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఛెత్రీ బెంగళూరు జట్టు ఐపీఎల్‌లో రాణించాలని శుబాకాంక్షలు తెలిపారు. కాగా, సోషల్‌మీడియా వేదికగా విరాట్ కోహ్లీ ఛెత్రీకి ధన్యవాదాలు తెలిపాడు. ‘‘నిన్న సునీల్ ఛెత్రీతో చాలా సంతోషంగా గడిపాము’’ అంటూ విరాట్, ఛెత్రీతో ఉన్న ఫోటోని ట్వీట్ చేశాడు. కాగా, ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ గతేడాది ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెపాక్ స్టేడియం వేదికగా జరుగనుంది.
The post ఆర్‌సీబీ ట్రైనింగ్ క్యాంప్‌కి ఊహించని అతిథి, దీంతో షాక్ అయిన విరాట్ కోహ్లి appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2YaEps3
No comments:
Post a Comment