ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి కారుకు సైతం జరిమాన పడింది! కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ఎదురైందీ అనుభవం. ఆయన ప్రయివేటు ఎస్‌యూవీ కారుపై గత నెలలో రెండుసార్లు జరిమాన విధించగా.. ఇప్పటికీ దీనిని చెల్లించలేదు. ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం… ఫిబ్రవరి 10న డ్రైవింగ్‌లో మొబైల్ వాడడం, 22న బసవేశ్వర సర్కిల్ సమీపంలో పరిమితికి మించి వేగంగా వెల్లడంతో సీఎం కారుకు చలాన్లు జారీ అయ్యాయి. ఇందులో ఒకటి రూ.100 కాగా మరో చలాన్ రూ.300గా ఉంది. ఈ రెండు రోజుల్లోనూ కుమారస్వామి బెంగళూరులోనే ఉన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండురోజుల తర్వాత ఫిబ్రవరి 10న ఆడియో టేపులపై ఆయన బిజీ బిజీగా గడిపారు. ఫిబ్రవరి 22న బెంగళూరు సబర్బన్ రైల్ ప్రాజక్టుపై చర్చించేందుకు సీఎం కుమార స్వామి కేంద్రరైల్వే మంత్రి పియూష్ గోయల్‌ను విధానసౌధలో కలుసుకున్నారు.
కాగా ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కెమేరాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయనీ… అదే ప్రక్రియలో నోటీసులు కూడా జారీ అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. వాహనానం కస్తూరి మీడియా ప్రయివేటు లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయి ఉండడంతో అదే పేరుతో నోటీసులు వెళ్లాయని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా కుమార స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటకీ ఎప్పుడూ అధికారిక వాహనం వినయోగించలేదు. అన్ని అధికారిక కార్యక్రమాలకు తన సొంత కారులోనే వెళ్లివచ్చేందుకు ఇష్టపడతారు.
The post ఎవరైనా సరే కట్టాల్సిందే …..! ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన సీఎం.. రెండుసార్లు జరిమానా! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2HLRKB4

No comments:
Post a Comment