లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈనెల 22న విడుదల ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రామ్ గోపాల్ వర్మ సిద్ధం అవుతుండగా సెన్సార్ బోర్డ్ బ్రేక్ వేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్‌ను ఆపాలని ఆదేశించింది. సీఈవో ఆదేశాల మేరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదలని స్పష్టం చేసింది. తొలి దశ ఎన్నికలు పూర్తయ్యేవరకు సినిమాని పరిశీలించడం సాధ్యం కాదని సెన్సార్ బోర్డు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చింది. అటు సెన్సార్ బోర్డు నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తానంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు. సెన్సార్ బోర్డు వారు ఇల్లీగల్‌గా సినిమాను ఆపే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తన సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడంలేదని మండిపడ్డారు. తాను ఈ విషయంలో వారిని కోర్టుకు లాగబోతున్నట్లు ట్వీట్ చేశారు. ఎన్నికల కోడ్ పేరుతో సినిమా సెన్సార్ స్క్రీనింగ్‌ని వాయిదా వేసే అధికారం సెన్సార్ బోర్డుకి లేదన్నారు.. ఇదంతా మరొకరి ప్రయోజనం కోసమే చేస్తున్నట్టుందని ఆరోపించారు.
సినిమాను విడుదలకు బ్రేక్ వేయడమంటే ఒక రకంగా ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్‌గోపాల్ వర్మ. ఏ రాజకీయ పార్టీతోనూ తమ సినిమాకి సంబంధం లేదని అన్నారు. సినిమాని చూడకముందే ఎన్నికల నియమావళి పేరిట ధ్రువీకరణ పత్రం ఇచ్చే ప్రక్రియని ఆలస్యం చేసే అధికారం సెన్సార్ బోర్డుకి లేదని పేర్కొన్నారు ఆర్జీవీ. ఈ వివాదంపై తన న్యాయవాదితో కలిసి మీడియా ముందుకొస్తున్నట్టు తెలిపారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల ఆపాలంటూ టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో.. సీఈవో ఆదేశాల మేరకు ఈ చిత్రం విడుదలను సెన్సార్ బోర్డ్ ఆపేసింది. ఏపీలో ఎన్నికలు పూర్తైన తర్వాత సినిమా విడుదల చేసుకోవచ్చని సూచించింది. సెన్సార్ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం రానిదే, సినిమా విడుదల సాధ్యం కాదు కాబట్టి విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలున్నాయి.
The post రోజుకో మలుపు తిరుగుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం, ఏమైందో తెలుసా …! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2TheECu


No comments:
Post a Comment