మలబద్దకం, థైరాయిడ్, డయాబెటిస్, మాంసం, ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్కువగా కూర్చుని ఉండడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి పైల్స్ వస్తాయి. ఈ సమస్య వచ్చిందంటే.. అప్పుడు కలిగే బాధను మాటల్లో చెప్పలేం. అయితే పైల్స్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే అందుకు కింద తెలిపిన చిట్కాలు పనిచేస్తాయి. అవేమిటంటే…
1. ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని బిర్యానీ ఆకులు (బే లీవ్స్), మూడు వెల్లుల్లి రెక్కలు వేయాలి. అనంతరం ఆ నీటిని 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మిశ్రమం మరిగాక దాన్ని చల్లార్చి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తుంటే పైల్స్ బాధించవు.
2. తెల్ల చామంతి పూవును తీసుకుని దాన్ని నీటిలో వేసి డికాక్షన్ కాయాలి. ఆ డికాక్షన్‌ను చల్లార్చి సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే ఫలితం ఉంటుంది.
3. చిన్న గ్లాస్‌లో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కొన్ని కాటన్ బాల్స్ వేసి నానబెట్టాలి. కొద్ది సేపు ఆగాక వాటిని తీసి సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే పైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. కలబంద (అలోవెరా) ఆకులను తీసుకుని వాటిని మధ్యలోకి చీల్చి వాటి నుంచి గుజ్జును సేకరించాలి. దాన్ని పైల్స్‌పై అప్లై చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.
5. ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి అందులో కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పైల్స్‌పై రాయాలి. దీంతో వాటి నుంచి వెంటనే ఉపశమనం లబిస్తుంది.
6. కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను ఒక గిన్నెలో తీసుకుని అందులో కాటన్ బాల్స్ ముంచి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో పైల్స్ బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నందున ఇది పైల్స్‌కు తక్షణ ఉపశమనంగా పనిచేస్తుంది.
7. టీ ట్రీ ఆయిల్ ను ఆముదం లేదా బాదం నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని పైల్స్‌పై రాస్తూ ఉండాలి. దీంతో కొద్ది రోజుల్లోనే పైల్స్ తగ్గిపోతాయి.
The post పైల్స్ తో బాధపడుతున్నారా ..! ఐతే మీకు శాశ్వత పరిష్కారం. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2UBXIYR
No comments:
Post a Comment