etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, March 21, 2019

వామ్మో ..! ఈ సరస్సులో స్నానం చేసినవారు ఒక్కరు కూడా బతికి రాలేదు, ఎక్కడో తెలుసా….!

సముద్రపు తరంగాల్లా, పాలనురుగులా పరవళ్లుతొక్కుతున్నాయి ఇక్కడి సరస్సులోని నీళ్లు. చూడటానికి ఎంత అందంగా ఉందో అంత భయంగానూ అనిపిస్తుంది హవాయి దీవుల్లో ఉన్న ఈ సరస్సు. అందుకే దీన్ని డెత్ పూల్ అని పిలుస్తారు పర్యాటకులు. గజ ఈతగాళ్లు సైతం గజగజ వణకాల్సిందే ఈ సరస్సుని చూస్తే. సముద్రంలోని అలలు ఒడ్డున ఉన్న మన పాదాల్ని తడిపి మళ్లీ వెనక్కు వెళతాయి. ఒక్కోసారి సముద్రంలోకి లాగేస్తాయి. అచ్చంగా అలాగే.. కానీ ఇక్కడ అప్పటి వరకు సరస్సు నిండా నీళ్లు ఉన్నట్టే ఉంటాయి.. అంతలోనే ఒక్కసారిగా తగ్గిపోతాయి. ఈత కొడుతున్నవారు కొట్టుకుపోతారేమో అని చూసేవారికి ఒకింత భయాన్ని కలిగిస్తాయి. నిజానికి ఇక్కడికి వచ్చిన పర్యాటకులను ఊరిస్తుంది ఈ సరస్సు. ఒక్కసారైనా దిగాలనిపిస్తుంది. ఇలా సాహసం చేసి ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. అయినా పర్యాటకుల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోతోంది హవాయి ప్రభుత్వం.

The post వామ్మో ..! ఈ సరస్సులో స్నానం చేసినవారు ఒక్కరు కూడా బతికి రాలేదు, ఎక్కడో తెలుసా….! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2W92gGw

No comments:

Post a Comment