అరటిపండ్ల వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీంతో మన శరీరానికి పోషకాలు అందడమే కాదు, అనారోగ్యాలు దూరమవుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. ఇంకా అనేక లాభాలు ఉంటాయి. అయితే కేవలం అరటి పండే కాదు, ఆ చెట్టుకు చెందిన పువ్వుతో కూడా మనకు అనేక లాభాలు ఉన్నాయి. అరటి పండు లాగే అరటి పువ్వును కూడా మనం తినవచ్చు. దాంతో అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా లభిస్తాయి. కానీ అరటి పండు పువ్వును డైరెక్ట్‌గా తినకూడదు. కూర వండుకుని తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలు కూడా లభిస్తాయి. అరటి పువ్వు వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. అనంతరం అందులో పోపు గింజలను వేయాలి. అవి వేగాక పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ముక్కలుగా కట్ చేసిన అరటి పువ్వును వేయాలి. దాంతోపాటు ఉప్పు, కొద్దిగా ఇంగువ, కరివేపాకులు, ధనియాల పొడి, కొత్తిమీర, పసుపు కూడా వేయాలి. అనంతరం కొంత నీరు పోసి పాత్రపై మూత పెట్టేయాలి. కొంత సేపటి తరువాత సన్నగా తురిమిన కొబ్బరి పొడిని వేయాలి. దీంతో అరటిపువ్వు కూర రెడీ అవుతుంది.
పైన చెప్పిన అరటి పువ్వు కూరను తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం…
1 .అరటి పువ్వు కూరను తరచూ తింటుండడం వల్ల స్త్రీలకు రుతుక్రమం సరిగ్గా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి.
2. పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. చాలా పోషకాలు లభించడం వల్ల అటు తల్లికి, ఇటు శిశువుకు కూడా మంచి చేస్తుంది.
3. డయాబెటిస్ ఉన్నవారు అరటిపువ్వు కూరను తరచూ తింటుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గిపోతాయి. షుగర్ అదుపులోకి వస్తుంది.
4. రక్తహీనత ఉన్నవారు అరటి పువ్వు కూరను తరచూ తినాలి. దీంతో రక్తం బాగా పడుతుంది. రక్తం వృద్ధి చెందుతుంది.
5. మూత్రపిండాల వ్యాధులతో ఇబ్బందులు పడే వారు అరటిపువ్వు కూరను తినడం మంచిది. దీంతో ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. అరటిపువ్వు కూర వల్ల జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటివి దూరమవుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
7. జీర్ణాశయంలో అల్సర్లు ఉన్నవారు అరటి పువ్వు కూరను తినాలి. దీంతో అల్సర్లు తగ్గుతాయి.
8. హైబీపీ అదుపులో ఉంటుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు రావు.
9. స్త్రీలలో గర్భాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
The post లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని వ్యాధులను ఈ అరటి పువ్వుతో చెక్ పెట్టవచ్చు, అవేంటో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FItkqK


No comments:
Post a Comment