etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, March 30, 2019

పవన్ పోటీ చేస్తున్న భీమవరంలో.. జనసేన నేతలు ఏం చేస్తున్నారంటే..

గ్రామాల అభివృద్ధి జనసేన అధినేత కొణిదెల పవన్‌కల్యాణ్‌ విజయంతోనే సాధ్యమని జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్‌ యిర్రింకి సూర్యారావు అన్నారు. దిరుసుమర్రులో శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం, ప్రచార సభ నిర్వహించారు. సూర్యారావు మాట్లాడుతూ సమస్యను గుర్తించి, పరిష్కరించే దిశగా పవన్‌కల్యాణ్‌ ఆలోచన చేస్తున్నారన్నారు. పవన్‌కల్యాణ్‌ను అఖండ మెజార్టీతో గెలిపిచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొటికలపూడి గోవిందరావు(చినబాబు) మాట్లాడుతూ జనసేన పార్టీ విజయం తధ్యమని పేర్కొన్నారు. పవన్‌ సిద్ధాంతాలతో ప్రజలందరికి సహకారం, ప్రోత్సా హం, గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామాలలో సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించగల సత్తా జనసేన పార్టీకే ఉందన్నారు. పవన్‌కల్యాణ్‌ స్థానికేతరుడు, అందుబాటులో ఉండ రనే మాటలను ఎవరన్నా ప్రజల దగ్గర చెబితే వాటిని తిప్పికొడతారని అన్నారు. కార్యక్రమంలో వేగేశ్న కనకరాజు సూరి, గ్రామ జనసేన నాయకులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.

దొంగ సర్వేలతో అడ్డుకోలేరు

పవన్‌కల్యాణ్‌ విజయాన్ని అడ్డుకోవడానికి కొందరు కుట్ర పన్నుతున్నారు. దొంగ సర్వేలతో జనాన్ని మోసం చేయలేరని జనసేన నాయకుడు, సినీ నిర్మాత బన్ని వాసు ఆరోపించారు. వైసీపీ, టీడీపీ ఇటువంటి ప్రచారాలను చేయడాన్ని ఆయన ఖండించారు. శుక్రవారం భీమవరం వచ్చిన వాసు ఎన్నికల శిబిరంలో మీడియాతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ భీమవరంలో క్లీన్‌స్వీప్‌ చేస్తారన్నారు. యువత కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటుందన్నారు. మల్లినీడి తిరుమలరావు (బాబి), బొమ్మదేవర శ్రీధర్‌ బన్ను, గంధం చెన్నుశేషు, తదితరులు పాల్గొన్నారు.

The post పవన్ పోటీ చేస్తున్న భీమవరంలో.. జనసేన నేతలు ఏం చేస్తున్నారంటే.. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2U9ojAr

No comments:

Post a Comment