ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించి.. ట్రోఫీని డిఫెండ్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా చెన్నై ఆటగాళ్లతో పాటు.. అభిమానుల్లో కూడా ఎంతో ఉత్సాహం నెలకొంది. అయితే మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించింది. అయితే అదే రోజు చెన్నై అటగాడు కేదార్ జాదవ్ పుట్టినరోజు కావడంతో మ్యాచ్ అనంతరం అతనికి డ్రెస్సింగ్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.
అయితే ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ ధోనీ చేసిన అల్లరి మామూలుగా లేదు. ముందుగా కేక్ కట్ చేసిన జాదవ్‌కి అంతా కలిసి కేక్ రుద్దారు. ఆ తర్వాత సురేశ్ రైనా వచ్చి జాదవ్‌కి టవల్ అందించాడు. దీంతో ధోనీ రైనాని కొంటె అబ్బాయి అంటూ సంబోధించాడు. ‘‘ముందు అంతా కేక్ రుద్ది.. ఆ తర్వాత టవల్ అందించే వాడిని కొంటె అబ్బాయి అని అంటారు’’ అని ధోనీ.. రైనాని అన్నాడు. ఆ తర్వాత కేదార్ తనవైపు చూస్తుంటే.. ‘‘నేను నీకు కేక్ రుద్దలేదు, నన్ను అలా చూడకు’’ అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇలాంటివి చూసినప్పుడే.. ధోనీని కెప్టెన్ కూల్ అంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
The post సీఎస్‌కే డ్రెస్సింగ్ రూంలో ధోనీ అల్లరి మామూలుగా లేదుగా..మీరు చుడండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2U3zvPa
No comments:
Post a Comment