మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి.. సీబీఐ మాజీ జేడీ, ప్రస్తుత జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ఆసక్తికర విషయాలు బయపెట్టారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వివేకా వ్యక్తత్వాన్ని ప్రశంసించారు. లక్ష్మీనారాయణకు, టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు బంధుత్వాన్ని అంటగడుతూ.. అప్పట్లో వివేకానంద రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివేకా తనకు ఫోన్ చేసి… ‘‘బాబూ తప్పైంది.. వేరే వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు అలా మాట్లాడాను. ఆఫీసుకు వచ్చి క్షమాపణలు చెబుతాను’’ అన్నారని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎవరో చెప్పినది విని అలా రియాక్ట్ అయ్యుంటారని.. కాబట్టి దీన్ని అంత సీరియస్‌గా తీసుకోనవసరం లేదని తాను వివేకాతో చెప్పానన్నారు. ఆయన ఆలోచన తీరు అలా ఉంటుందని లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా తనకు ఎలాంటి సబంధం లేదని తెలిపారు. తిత్లీ తుఫాను సమయంలోనే చంద్రబాబును తొలిసారి కలుసుకున్నా అన్నారు.
The post వైఎస్ వివేకానంద రెడ్డి ఆరోజు నాకు కాల్ చేసి సారీ సర్ అని చెప్పారు : లక్ష్మీనారాయణ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2JLyiHw
No comments:
Post a Comment