పార్లమెంట్ ఎన్నికలే అస్త్రంగా మద్దతు ధర కోసం రైతులు పోరాటం చేయబోతున్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామానికి ఐదుగురు చొప్పున నామినేషన్లు వేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధమైంది. నామినేషన్లు వేయడంపై పలు మండలాల్లో సమావేశాలు జరిగాయి. కనీసం వెయ్యిమంది రైతులు నామినేషన్లు వేసి.. తద్వారా జాతీయ స్థాయిలో తమ సమస్యను ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతుధర కల్పించాలని ఇప్పటికే అనేక ధర్నాలు, నిరసనలు తెలిపినా తమకు న్యాయం జరగలేదని.. అందుకే ఈ తరహా ఉద్యమాన్ని కూడా తాము ఎంచుకున్నామంటున్నారు. గతంలో ఎర్రజొన్న రైతులు ధర్నాలు, రహదారుల దిగ్భందాలు, చలో హైదరాబాద్ లాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ఎన్నికల్లో పోటీయే సరైన అస్త్రంగా రైతులు భావిస్తున్నారు.
The post ఆ ఎంపీ స్థానానికి నామినేషన్లు వేయనున్నవెయ్యిమంది రైతులు, కారణం ఇదే. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2TfN4pi
No comments:
Post a Comment